Dhamaka Movie Collections | రవితేజ తిరిగి హిట్ ట్రాక్‌లోకి వచ్చేశాడు. ‘క్రాక్’ తర్వాత సరైన హిట్టు లేని రవితేజకు ‘ధమాకా’ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్లతో పట్టుకోల్పోయిన రవితేజ మార్కెట్ ఈ సినిమాతో మళ్లీ పుంజుకుంది. భారీ అంచనాల నడుమ గత శుక్రవారం రిలీజైన ఈ సినిమా మొదటి షో నుండి మిక్స్డ్ రివ్యూలను తెచ్చుకుంది. కానీ వసూళ్లలో మాత్రం జోరు చూపిస్తుంది. టాక్‌తో సంబంధంలేకుండా భారీ కలెక్షన్లు సాధిస్తూ బాక్సాఫీస్ దగ్గర రవితేజ సత్తా ఎంటో తెలియజేస్తుంది. రోజు రోజుకు ఈ సినిమాపై ఆదరణ పెరుగుతూనే ఉంది.
ధమాకా మూవీ నాలుగు రోజుల్లో నలభైకోట్ల గ్రాస్‌ను కలెక్ట్ చేసి భీభత్సం సృష్టిస్తుంది. ఇంత త్వరగా 40కోట్ల గ్రాస్ కలెక్షన్లు క్రాక్ సినిమాకు కూడా రాలేవు. ఇలాగే దూసుకుపోతే త్వరలోనే వంద కోట్ల గ్రాస్ టచ్ చేసిన ఆశ్చర్యపోనక్కర్లేదు. పైగా ఈ సినిమాకు పోటీగా రిలీజైన 18పేజీస్ అంతంత మాత్రంగానే రాణిస్తుంది. అంతేకాక వచ్చే వారం కూడా చెప్పుకోదగ్గ సినిమాలేవి రిలీజ్ కావడం లేదు. దాంతో ధమాకా సినిమాకు మరో రెండు వారాల వరకు అసలు పోటీనే లేదు. ఈ లోపు నిర్మాతలు లాభాల బాట పట్టడం ఖాయం.
రవితేజ ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమాకు త్రినాథ్‌రావు నక్కిన దర్శకత్వం వహించాడు. క్రాక్ తర్వాత రవితేజ నుండి ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ చూడటంతో అభిమానుల సంతోషాలకు హద్దులు లేకుండా పోయాయి. ఇక శ్రీలీల తన నటన, డ్యాన్స్‌తో అందరిని ఆకట్టుకుంది. భీమ్స్ సిసిరోలియో తన బాణీలతో ప్రేక్షకులను సీట్లలో కూర్చోనివ్వలేదు. పీపుల్ మీడియా, అభిషేక్ అగర్వాల్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు ప్రసన్న కుమార్ బెజవాడ కథ-స్క్రీన్‌ప్లే-మాటలు అందిస్తున్నాడు.
MassMaharaja @RaviTeja_offl 's
MASSive 4️⃣ Days
Unstoppable Rampage 💥#DhamakaBlockBuster in Cinemas Now 🥳🤩#DhamakaBook your tickets nowhttps://t.co/iZ40p9utmY@sreeleela14 @TrinadharaoNak1 @vishwaprasadtg @vivekkuchibotla @KumarBezwada pic.twitter.com/oHZg2fj4W3
— People Media Factory (@peoplemediafcy) December 27, 2022