కల్యాణ్‌రామ్ కథానాయకుడిగా నటిస్తున్న పీరియాడిక్ స్పై థ్రిల్లర్ ‘డెవిల్’. స్వీయ దర్శకత్వంలో అభిషేక్ నామా తెరకెక్కిస్తున్నారు. సంయుక్త మీనన్ కథానాయిక. ఈ సినిమాలో ఓ రహస్యాన్ని ఛేదించే బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్ పాత్రలో హీరో కల్యాణ్‌రామ్ కనిపించబోతున్నారు.
తాజాగా ఈ సినిమా నుంచి ‘ఏ మాయ చేసే..’ అనే పాటను ఈ నెల 19న విడుదల చేయబోతున్నారు. ఈ సందర్భంగా కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు. హర్షవర్దన్ రామేశ్వర్ స్వరపరచిన ఈ పాటను సిధ్‌శ్రీరామ్ ఆలపించారు. మనసుకు హత్తుకునే మెలోడీ గీతమిదని చిత్రబృందం పేర్కొంది.