Devara Movie | టాలీవుడ్ అగ్ర కథానాయకుడు ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న చిత్రం దేవర. నందమూరి అభిమానులతో పాటు మూవీ లవర్స్ ఆసక్తిగా ఈ సినిమా కోసం ఎదురుచూస్తుండగా.. ఈ చిత్రం సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘అరవింద సమేత వీర రాఘవ’ వంటి బ్లాక్ బస్టర్ తరువాత ఎన్టీఆర్ సోలోగా వస్తుండటంతో ఈ మూవీపై ఇటు టాలీవుడ్‌తో పాటు పాన్ ఇండియా వైడ్‌గా భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే మూవీ నుంచి ట్రైలర్‌ను విడుదల చేయగా.. రికార్డు వ్యూస్‌తో యూట్యూబ్‌లో దూసుకుపోతుంది. అయితే ఈ సినిమా నుంచి రిలీజ్ ట్రైలర్‌ను ఉదయం 11.07 గంటలకు విడుదల చేస్తామని చిత్రబృందం శనివారం ప్రకటించిన విషయం తెలిసిందే.
అయితే అనివార్య కారణాల వల్ల ట్రైలర్ విడుదల ఆలస్యం అవుతుందని పేర్కొంటూ ఆదివారం ఉదయం ట్వీట్ పెట్టింది. దీంతో ఎన్టీఆర్ అభిమానులు దేవర టీంపై ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. దీంతో తాజాగా క్లారిటీ ఇస్తూ.. ఈ మూవీ రిలీజ్ ట్రైలర్‌ను నేడు మధ్యాహ్నం 2.07 గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. అత్యంత భారీ సునామీ కోసం అప్పటివరకు వేచి ఉండండి అంటూ రాసుకోచ్చింది.
#DevaraReleaseTrailer today at 2:07PM 💥💥
Stay hyped for the MASSIEST PHENOMENON! ⏳#Devara
— Devara (@DevaraMovie) September 22, 2024