Devara Movie – Saif Ali Khan | ఎన్టీఆర్ కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘దేవర’ (Devara). ఈ సినిమాను సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్రబృందం ప్రకటించిన విషయం తెలిసిందే. జనతా గ్యారేజ్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వీరిద్దరి కాంబోలో ఈ సినిమా రానుండటంతో భారీ అంచనాలు ఉన్నాయి. ఇక రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో జాన్వీకపూర్ కథానాయికగా నటిస్తుండగా, బాలీవుడ్ స్టార్ నటుడు సైఫ్ అలీఖాన్ విలన్ పాత్రలో కనిపించనున్నారు.
ఇదిలావుంటే నేడు సైఫ్ అలీ ఖాన్ పుట్టినరోజు. ఈ సందర్భంగా మేకర్స్ సైఫ్‌కి విషెస్ తెలుపుతూ.. దేవర నుంచి భైరా గ్లింప్స్ విడుదల చేశారు. ఈ వీడియోలో యోధుడిలా కనిపిస్తున్న బైరా మల్ల యుద్ధంలో ప్రత్యర్థిని ఎత్తి విసిరేస్తునట్టుగా వీడియోలో చూపించారు. ప్రస్తుతం ఈ వీడియో గూస్ బంప్స్ తెప్పిస్తుంది.
విస్మరణకు గురైన ఓ తీర ప్రాంతం నేపథ్యంలో హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ పతాకాలపై సుధాకర్, హరికృష్ణ కె ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ స్వరకర్త.