Devara Movie | ‘ఆర్ఆర్ఆర్’ వంటి బ్లాక్ బస్టర్ తరువాత టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ చేస్తున్న తాజా చిత్రం ‘దేవర’(Devara). కొరటాల శివ (Koratala Shiva) ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. శ్రీదేవి గారలపట్టి జాన్వీకపూర్ (Janvi kapoor) ‘దేవర’తో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అవుతుంది. సైఫ్ అలీఖాన్ విలన్‌గా నటిస్తున్నాడు. ఇక ఈ సినిమా రెండు భాగాలుగా రానున్నట్లు మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. తొలిభాగం 2024 ఏప్రిల్ 5న విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి తారక్ లుక్‌తో పాటు, సైఫ్ అలీఖాన్, జాన్వీకపూర్ లుక్‌లను రిలీజ్ చేయగా.. ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా నుంచి ఒక సాలిడ్ న్యూస్ వైరల్ అవుతుంది.
ఈ మూవీలో ఎన్టీఆర్ రెండు లుక్స్ లో కనిపించబోతున్నారంటూ వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ లుక్‌లపై ‘దేవర’లో నటిస్తున్న కేజీఎఫ్ ఫేమ్ నటుడు తారక్ పొన్నప్ప రివీల్ చేశాడు. ఓ ఇంటర్వ్యూలో భాగంగా పొన్నప్ప దేవర మూవీ గురించి మాట్లాడుతూ.. ఇప్పుడు మీరు చూస్తున్న తారక్ దేవర లుక్ నార్మల్ది. అసలు లుక్‌ని చిత్రబృందం సీక్రెట్‌గా దాచారు. ఆ లుక్ ని మీరు చూస్తే.. చాలా థ్రిల్‌గా, కేజ్రీగా ఫీల్ అవుతారు. ఆ లుక్ చాలా రగ్డ్గా, ఊర మాస్‌గా ఉంటుంది. దేవరగా తారక్ నటన చూసి నాకు గూస్బంప్స్ వచ్చాయి అంటూ పొన్నప్ప చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మరోవైపు.. దేవర టీజర్‌ను డిసెంబర్ 22న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. డిసెంబర్ 22న రెండు పాన్ ఇండియా సినిమాలు సలార్, డంకీ విడుదల అవుతున్న విషయం తెలిసిందే. అదేరోజున ఈ సినిమాలతో దేవర టీజర్‌ను థియేటర్స్‌లో విడుదల చేయనున్నట్లు సమాచారం.