Devara Movie | టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ చేస్తున్న తాజా చిత్రం ‘దేవర’(Devara). కొరటాల శివ (Koratala Shiva) ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. జాన్వీకపూర్ (Janvi kapoor) హీరోయిన్గా నటిస్తుంది. సైఫ్ అలీఖాన్ విలన్‌గా నటిస్తున్నాడు. ఇక ఈ సినిమా రెండు భాగాలుగా రానున్నట్లు మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. తొలిభాగం 2024 అక్టోబర్ 10న విడుదల కానుంది. ఇప్పటికే మూవీ నుంచి ఫస్ట్ లుక్‌తో పాటు గ్లింప్స్ విడుదల చేయగా.. ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా నుంచి ఒక సాలిడ్ రూమర్ బయటకు వచ్చింది.
ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్‌ను మేకర్స్ లాంచ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. మే 20 జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు ఈ సందర్భంగా ఆరోజే మూవీ నుంచి ఫస్ట్ సింగిల్‌ను విడుదల చేయనున్నట్లు తెలుస్తుంది. కాగా దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్రకాష్‌రాజ్, శ్రీకాంత్, టామ్ షైన్ చాకో, నరైన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రాన్ని నందమూరి కల్యాణ్‌రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ పతాకాలపై మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ కె నిర్మిస్తున్నారు.