Maya Sabha | ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి(YSR). ప్రస్తుత ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(CBN)లపై ఒక వెబ్ సిరీస్ రాబోతుంది. వీరిద్దరి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ని ఆధారంగా చేసుకుని 1990లో ఉన్న ఆంధ్ర రాజకీయాలపై ప్రముఖ దర్శకుడు దేవకట్టా మయసభ అనే వెబ్ సిరీస్ తెరకెక్కిస్తున్నాడు.
ఇందులో తమిళ నటుడు ఆది పినిశెట్టి చంద్రబాబు నాయుడి పాత్రలో నటిస్తుండగా.. కీడాకోలా సినిమాతో అలరించిన చైతన్య రావు వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాత్ర పోషిస్తున్నాడు. ప్రముఖ ఓటీటీ వేదిక సోని లివ్‌లో ఈ వెబ్ సిరీస్ ఆగష్టు 07 నుంచి స్ట్రీమింగ్‌లోకి రాబోతుండగా.. తాజాగా దీనికి సంబంధించిన టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు.
ఈ టీజర్ చూస్తుంటే.. ఎన్టీఆర్‌ని ఎదిరించి ఎమ్మెల్యేలందరినీ హోటల్‌కి రప్పించుకున్న చంద్రబాబు వైఎస్‌కి ఫోన్ చేసి నీ సహాయం కావాలని కోరడం చూడవచ్చు. చంద్రబాబు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు యూత్ కాంగ్రెస్‌లో కీలక పాత్రలను పోషించారు. అయితే వీరిద్దరు కాలేజ్‌లో ఉన్న సమయంలో వాళ్ల ఫ్రెండ్షిప్ ఎలా ఉంది.. రాజకీయల్లోకి వచ్చాక ఎలా మారింది. అనే విషయాలపై వెబ్ సిరీస్‌ను తెరకెక్కిస్తున్నారు దేవకట్టా.