హైదరాబాద్: అఖండ చిత్రంలో అఘోర రూపంలో బాలకృష్ణ సినీ ప్రేక్షకుల్ని ఫుల్ థ్రిల్ చేస్తున్నాడు. అయితే ఆ మహారుద్ర రూపాన్ని డిజైన్ చేసింది కాస్టూమ్ స్టయిలిస్ట్ రామ్. వెస్ట్ గోదావరి జిల్లాలోని రాజోల్కు చెందిన రామ్ చాన్నాళ్ల క్రితమే ఫ్యాషన్ డిజైన్ ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యారు. ఆయన జీవిత భాగస్వామి చంద్రికతో కలిసి అతను రామ్జ్ కంపెనీని ఏర్పాటు చేశాడు. ఇక అఖండ చిత్రంలో ఆ పాత్రను రామ్జ్ తీర్చిదిద్దిన తీరు అసాధారణం. అఘోర ఆకారాన్ని వెండితెరపై ప్రచండ రీతిలో కనించేలా చేశాడు రామ్జ్. బోయపాటి తీసిన అఖండ చిత్రలో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేశాడు. మురళీ కృష్ణ పేరుతో ఓ పాత్రలో రైతులా బాలకృష్ణ నటించాడు. దాని కోసం కూడా బాలకృష్ణను చాలా స్టయిలిష్‌గా చూపించారు. సూట్లు, షర్ట్లు, పంచ దుస్తుల్లో మురళీ కృష్ణ పాత్ర చాలా అట్రాక్టివ్‌గా ఉంటుంది. దీని కోసం స్టయిలిస్టు రామ్జ్ చాలా లేటెస్ట్ డిజైనింగ్‌ను ప్రమోట్ చేశాడు. చాలా హుందాగా ఆ పాత్రను ప్రజెంట్ చేశాడు.
ఇక అఘోర పాత్ర కోసం కూడా డిజైనర్ రామ్జ్ తన ట్యాలెంట్‌ను చూపించాడు. బాలకృష్ణ నిజంగా రుద్రతేజంతో వెలిగేలా చేశాడు. అఘోర పాత్ర కోసం కాస్టుమ్స్ వాడిన తీరు హైలెట్. అఖండ క్యారెక్టర్లో ఉన్న శక్తిని చాటేందుకు బ్లాక్ డ్రెస్సును ఎంపిక చేశారు. బ్లాక్ కలర్ ఔట్ఫిట్తో అఖండ భీకరంగా కనిపిస్తాడు. ఎప్పుడూ కాషాయ రంగు కండువాను తన భుజంపై కప్పుకుంటాడు. అఘోర్ లుక్‌లో ఇవన్నీ కీలకం. శివాంశ అంటే రుద్రాక్ష ధారణ తప్పనిసరి. ఆ లుక్ కూడా అదిరేలా చేశాడు రామ్జ్. రుద్రాక్ష మాలలతో.. టట్టూలు, త్రిశూలాన్ని డిజైన్ చేసిన తీరు ఆ పాత్రకే వెన్నె తెచ్చింది. ప్రళయాకారుడైన శివాకారాన్ని తీర్చేందుకు స్టయిలిస్టు రామ్జ్ చాలా కష్టపడ్డాడు.
బాలకృష్ణకు శివుడి టట్టూలను సెలెక్ట్ చేసింది కూడా రామ్జ్. చాలా రీసర్చ్ చేసిన తర్వాత ఆ టట్టూలను వేయించారు. ఇక సినిమాలో కొన్ని ఫైట్ సీన్లలో శివలింగం లాకెట్‌ను కూడా అఖండ వాడుతారు. ఆ లాకెట్‌ను కూడా డిజైనర్ రామ్జ్ తయారు చేశాడు. కాస్టూమ్ డిజైనింగ్‌తో అఖండ పాత్రకు ప్రాణం పోశాడు రామ్జ్. ఆ పాత్ర కోసం ఎంత పరిశోధన చేయాల్సిందని చెప్పాడతను. పర్ఫెక్ట్ అఖండ లుక్ కోసం అఘోరుల జీవితాలను స్టడీ చేశాడు. నిజానికి అఘోరాలు ఎక్కువగా డ్రెస్సు వేసుకోరు. వాళ్లు చాలా శక్తివంతులు, కానీ సింపుల్‌గా ఉంటారు. ఇక ఆ క్యారెక్టర్లో రౌద్రం కూడా కనిపించాలి. ముక్కంటి విధ్వంసక శక్తిని ఆ పాత్రలో చూపించాలి. దాని కోసమే బ్లాక్ డ్రెస్సును ఎంపిక చేసినట్లు రామ్జ్ తెలిపాడు.
2007లో వచ్చిన జగడం సినిమాతో రామ్జ్ ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యాడు. ఆ తర్వాత విజయ దేవరకొండ, రాణా దగ్గుబాటి, నాగార్జున లాంటి వాళ్లకు స్టయిలిస్టు డిజైనర్ గా చేస్తున్నాడు. రాజనీకాంత్ చేసిన రోబో చిత్రంలోనూ డిజైనర్‌గా చేశాడతను. అతని కెరీర్లో అఖండ ఓ మరుపురాని డిజైన్ వర్క్.