అరుల్‌నిధి, ప్రియ భవానీశంకర్ జంటగా నటించిన హారర్ థ్రిల్లర్ ‘డిమాంటీ కాలనీ 2’. అజయ్ ఆర్.జ్ఞానముత్తు దర్శకుడు. విజయసుబ్రహ్మణ్యన్, ఆర్.సి.రాజ్‌కుమార్ నిర్మాతలు. ఈ నెల 15న తమిళంలో విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతున్న ఈ సినిమా ఈ నెల 23న తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇప్పటికే తెలుగులో విడుదలైన ట్రైలర్‌కి మంచి స్పందన వస్తున్నదని, సినిమాకు కూడా అదే స్పందన వస్తుందని నమ్మకంతో ఉన్నామని మేకర్స్ తెలిపారు. ఆన్తి జాస్కేలైనెస్, సెరింగ్ డోర్జీ, అరుణ్ పాండియన్, ముత్తుకుమార్, మీనాక్షి గోవింద్రాజన్, సరనో ఖాలిద్, అర్చన రవిచంద్రన్ తదితరులు ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కెమెరా: హరీశ్ కన్నన్, సంగీతం: సామ్ సీఎస్.