Jawan Movie | బాలీవుడ్ బాద్షా షారుఖ్ నుండి సినిమా వచ్చి దాదాపు నాలుగేళ్ళు దాటింది. 2018లో వచ్చిన ‘జీరో’ తర్వాత ఇప్పటివరకు ఈయన నుండి మరో సినిమా రాలేదు. షారుఖ్‌ను వెండితెరపై చూడాలని అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఈయన మూడు చిత్రాలను సెట్స్‌పైన ఉంచాడు. అందులో ‘జవాన్’ ఒకటి. తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. ఇటీవలే చిత్రం నుండి విడుదలైన టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త నెట్టంట వైరల్‌గా మారింది.
ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె కీలకపాత్రలో నటించనున్నట్లు టాక్. సినిమాను మలుపు తిప్పే పాత్రలో ఈమె నటించనుందట. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుంది. ఈ చిత్రంలో షారుఖ్ తండ్రి, కొడుకుగా డ్యూయల్ రోల్లో నటించనున్నాడు. నయనతార ఇన్వెస్టిగేటీవ్ ఆఫీసర్‌గా నటించనుంది. బాలీవుడ్ భామ సాన్య మల్హోత్రా మరో కీలకపాత్రలో నటించనుంది. ప్రస్తుతం షారుఖ్ నటించిన ‘పఠాన్’ విడుదలకు సిద్ధంగా ఉంది. సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దీపికా పదుకొనే హీరోయిన్గా నటించింది. దీనితో పాటు రాజ్ కుమార్ హిరాణి దర్శకత్వంలో ‘డుంకి’ సినిమాను చేయబోతున్నాడు.