Deepika Padukone | గతంలో ఎప్పుడూ చూడని పర్ఫార్మెన్స్తో ‘ఫైటర్’ సినిమాలో మెప్పించింది బాలీవుడ్ భామ దీపికా పదుకోన్. హృతిక్‌రోషన్‌తో కలిసి నటించిన ఈ చిత్రంలో తనలోని విభిన్న నటీమణిని ఆవిష్కరించినందుకు దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్‌పై గతంలో ఈ హాట్‌గాళ్ ఓ రేంజ్లో ప్రశంసల వర్షం కురిపించింది. ఆయన ఆలోచనా విధానం అద్భుతం అంటూ కొనియాడింది. అతను సృష్టించిన పాత్రలు ఆడియన్స్ హృదయాల్లో స్టిక్కర్లలా అతుక్కుపోతాయ్.. వాటిని పీక్కోవాలంటే రెండుమూడు రోజులైనా పడుతుంది’ అంటూ తెగ పొగిడేసింది. రషెస్ చూస్తున్నప్పుడే గూజ్బంప్స్ వచ్చాయి. హాలీవుడ్ సినిమా చూస్తున్న అనుభూతి’ కలిగిందని చెప్పుకొచ్చింది కూడా.
తన మనసుకు హత్తుకునే యాక్టింగ్, డైరెక్షన్, పాత్రల చిత్రీకరణపై తన అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా చెప్పే ఈ బాలీవుడ్ భామ తాజాగా ఓ అమెరికన్ నటుడి ప్రదర్శనకు ఫిదా అయింది. అమెరికన్ నటుడు బ్రాడ్లీ కూపర్ ‘మాస్ట్రో’ చిత్రంలో లియోనార్డ్ బెర్న్‌స్టెయిన్ పాత్ర పోషించిన విషయం విదితమే. ఈ పాత్రలో ఆయన పర్ఫార్మెన్స్ అద్భుతమంటూ దీపికా ప్రశంసల వర్షం కురిపించింది. ఇది గొప్ప ప్రదర్శనల్లో ఒకటిగా ఆమె అభివర్ణించింది. ఇదే విషయాన్ని తన అభిమానులతో పంచుకునేందుకు తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ‘మాస్ట్రో’ చిత్రంలోని క్లిప్‌ను షేర్ చేసింది ఈ బాలీవుడ్ స్టార్.