Deepika Padukone | పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘స్పిరిట్’ (Spirit) నుంచి హీరోయిన్ దీపికా పదుకొనే తప్పుకున్న సంగతి తెలిసిందే.
తాజాగా ఈ విషయంపై సందీప్ రెడ్డి వంగా సోదరుడు, నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. దీపికా పదుకొనే రెమ్యునరేషన్‌తో పాటు సినిమాలో 10 శాతం లాభాల వాటా అడగడం వలనే బడ్జెట్ లెక్కలు కుదరక ఆమెను ప్రాజెక్ట్ నుంచి తప్పించాల్సి వచ్చిందని వెల్లడించారు. అంతేకాకుండా ఆమె షూటింగ్ వేళల విషయంలో కొన్ని షరతులు పెట్టారని, ఈ కారణంగానే విభేదాలు తలెత్తాయని తెలిపారు. ఈ వ్యాఖ్యలపై ఒక జర్నలిస్ట్ స్పందిస్తూ.. కేవలం మహిళా నటీనటులు ప్రాఫిట్ షేరింగ్ అడిగితేనే విమర్శలు చేస్తారా? ఎంతో మంది హీరోలు ఏళ్ల తరబడి ఇదే విధానాన్ని అనుసరిస్తున్నారు కదా అంటూ ఒక పోస్ట్ షేర్ చేశారు. అయితే ఈ పోస్ట్‌ను దీపికా పదుకొనే లైక్ చైయడం ద్వారా తన వాదనకు మద్దతు తెలిపారు.
గతంలో కూడా దీపికా పదుకొనే ఎనిమిది గంటల పని వేళల డిమాండ్ వివాదంపై మాట్లాడుతూ, పురుష నటులు కూడా ఇలాంటి షరతులతో పనిచేస్తున్నప్పటికీ తనను మాత్రమే టార్గెట్ చేయడం సరికాదని అభిప్రాయపడ్డారు. ఈ వివాదం తర్వాత ఈ చిత్రంలో దీపిక స్థానంలో త్రిప్తి డిమ్రిని హీరోయిన్గా ఎంపిక చేసిన విషయం తెలిసిందే. భారీ అంచనాల మధ్య రూపొందుతున్న ఈ సినిమా 2027 మార్చి 5న విడుదల కానుంది. మరోవైపు దీపికా పదుకొనే షారుఖ్ ఖాన్‌తో కలిసి ‘కింగ్’, అల్లు అర్జున్ – అట్లీ కాంబినేషన్లో రాబోయే ‘రాకా’ సినిమాలతో బిజీగా ఉన్నారు.