బాలీవుడ్లో మరో బిగ్గెస్ట్ మూవీగా తెరకెక్కనుంది ‘వార్ 2’. ఈ చిత్రంలో హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కథానాయకులుగా నటించబోతున్నారు. యష్ రాజ్ ఫిలింస్ స్పై యూనివర్స్ నిర్మించనుంది. అయాన్ ముఖర్జీ దర్శకుడు. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభమయ్యాయి. నాయికగా ఎవరిని ఎంపికచేయాలనే విషయంలో చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. ముగ్గురు తారలను ఈ సినిమా కోసం సంప్రదిస్తున్నారట. అందులో దీపికా పడుకోన్, ఆలియా భట్, శార్వరీ వాఘ్ ఉన్నట్లు సమాచారం. వీరిలో ఎవరి డేట్స్ అందుబాటులో ఉంటే వారిని నాయికగా ఎంచుకోవాలని భావిస్తున్నారట. అయితే ఈ ముగ్గురిలో దీపికకే ఎక్కువ అవకాశాలున్నట్లు తెలుస్తున్నది. ఆమె ఇటీవల షారుఖ్‌తో కలిసి నటించిన ‘పఠాన్’ సినిమా ఘన విజయం సాధించింది. ఈ క్రేజ్‌తో పాటు తమ సంస్థకు ఓ సూపర్‌హిట్ ఇచ్చిన దీపికను నాయికగా తీసుకోవడానికే యష్ రాజ్ ఫిలింస్ మొగ్గుచూపిస్తున్నదట.