విజయ్ దేవరకొండ సినిమాకు హిందీలో భారీ ఆదరణ

యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ అతి తక్కువ టైంలోనే అశేష ప్రేక్షకాదరణ పొందాడు. అర్జున్ రెడ్డి సినిమాతో దేశ వ్యాప్తంగా పాపులారిటీ దక్కించుకున్న విజయ్ ప్రస్తుతం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ అనే పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. ఈ చిత్రానికి కరణ్ జోహార్ సహా నిర్మాతగా వ్యవహరించడంతో భారీ అంచనాలు పెరిగాయి. అయితే విజయ్ దేవరకొండ హీరోగా నటించి తెలుగులో ఫ్లాపైన ‘డియర్ కామ్రేడ్’ మూవీ హిందీలో మాత్రం ఓ రేంజ్లో ఇరగదీసింది.
డియర్ కామ్రేడ్ చిత్రం జనవరి 19న యూబ్యూబ్‌లో విడుదల కాగా, ఇది విడుదలైన 24 గంటల్లోనే 12 మిలియన్లు (కోటి 20 లక్షల) వ్యూస్ సాధించిది . అంతేకాదు ఏడాదిన్నర వ్యవధిలో ఏకంగా 250 (25 కోట్లు) మిలియన్ వ్యూస్ రాబట్టి సంచలనం రేపింది. 2.9 లైక్స్ సంపాదించి రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేసింది. మన సినిమాలకు హిందీ ప్రేక్షకులు ఇంత ఫిదా అవుతుండడం అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. భరత్ కమ్మ దర్శకత్వంలో తెరకెక్కిన డియర్ కామ్రేడ్ చిత్రం తెలుగులో 2019 జులై 26న విడదలయింది. విజయ్ దేవరకొండ సరసన రష్మిక మందన్న హీరోయిన్గా నటించింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

