శుక్రవారం 05 జూన్ 2020
Cinema - May 17, 2020 , 15:18:12

డేవిడ్ వార్న‌ర్ తాజా టిక్ టాక్ వీడియో చూశారా..!

డేవిడ్ వార్న‌ర్ తాజా టిక్ టాక్ వీడియో చూశారా..!

లాక్ డౌన్ వ‌ల‌న క్రికెట్ లేక ఇంటికే ప‌రిమిత‌మైన డేవిడ్ వార్నర్ సోష‌ల్ మీడియాలో రెచ్చిపోతున్నారు. ఎక్కువ‌గా ద‌క్షిణాది ప‌రిశ్ర‌మ‌కి సంబంధించిన పాటలకి డ్యాన్స్‌లు చేయ‌డం లేదంటే ప‌వ‌ర్ ఫుల్ డైలాగ్స్‌కి యాక్టింగ్ చేయ‌డం చేస్తున్నారు.  ఇప్పటికే అల వైకుంఠపురంలో మూవీలోని బుట్ట బొమ్మ, రాములో రాములో సాంగ్ కి తన భార్యతో కలిసి స్టెప్స్ వేసి అలరించిన‌ వార్నర్.. పోకిరి సినిమాలో మహేష్ డైలాగ్ చెప్పి మహేష్ ఫ్యాన్స్ కి కిక్కిచ్చాడు.

తాజాగా ఆయన ప్రభుదేవా ఎవర్ గ్రీన్ ముక్కాల ముక్కాబుల సాంగ్ కి భార్యతో కలిసి డాన్స్ చేశాడు. స్ట్రీట్ డాన్సర్ మూవీ కోసం ముక్కాల ముక్కాబుల సాంగ్ ని రీమిక్స్ చేయగా ఆ పాటకు డేవిడ్ వార్నర్ డాన్స్ చేసి ఆకట్టుకున్నారు. ప్ర‌స్తుతం డేవిడ్ వార్నర్ వీడియో సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తుంది.   logo