Devara | ఇటీవల కాలంలో మలయాళ యాక్టర్లు తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి.. మంచి క్రేజ్ సంపాదిస్తున్నారు. అలా సూపర్ క్రేజ్ అందుకుంటున్న యాక్టర్లలో ఒకడు షైన్ టామ్ చాకో (Shine Tom Chacko). నాని (Nani) నటించిన పక్కా మాస్ ఎంటర్టైనర్ దసరా సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. ఇందులో తన విలనిజంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం నాగశౌర్య నటిస్తోన్న రంగబలిలో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నాడు.
కాగా కొరటాల శివ (Siva Koratala)-జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) కాంబోలో వస్తున్న మోస్ట్ అవెయిటెడ్ ప్రాజెక్ట్ దేవర (Devara)లో కీలక పాత్రలో కనిపించబోతున్నాడు షైన్ టామ్ చాకో. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు. ఫ్యాన్ మేడ్ పోస్టర్‌ను షేర్ చేస్తూ.. షైన్ టామ్ చాకో ఈ విషయాన్ని పరోక్షంగా తెలియజేశాడు. విలక్షణ నటనతో ఎంటర్టైన్ చేసే ఈ మలయాళ నటుడు ఎలాంటి పాత్రలో కనిపించబోతున్నాడన్నది ప్రస్తుతానికి సస్పెన్స్ నెలకొంది. దేవర షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో కొనసాగుతున్నట్టు ఇన్సైడ్ టాక్.
ఎన్టీఆర్ 30 (NTR 30)గా వస్తున్న దేవరలో బాలీవుడ్ భామ జాన్వీకపూర్ హీరోయిన్గా నటిస్తోంది. ఫిషింగ్ హార్బర్ విలేజ్, పోర్ట్ మాఫియా బ్యాక్ డ్రాప్ చుట్టూ తిరిగే కథాంశంతో వస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. దేవర 2024 ఏప్రిల్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి.
మల్టీ లింగ్యువల్ ప్రాజెక్ట్‌గా వస్తున్న ఈ చిత్రానికి రత్నవేల్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. జనతాగ్యారేజ్ తర్వాత వస్తున్న రెండో సినిమా కావడంతో ఎన్టీఆర్ 30పై అంచనాలు భారీగానే ఉన్నాయి.
Devara1