Dasara Movie Censor | యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్‌లో విపరీతమైన క్రేజ్ ఉన్న హీరోలలో నాని ఒకడు. ఆయన నుంచి సినిమా వస్తుందంటే ఫ్యామిలీ ఆడియోన్స్ మారో మారు ఆలోచించకుండా థియేటర్లకు వెళ్తుంటారు. అయితే ఇప్పటి వరకు నానిని పక్కంటి కుర్రాడులాంటి పాత్రల్లో చూశాం. కానీ తొలిసారి దసరాతో ఒక పూర్తి స్థాయి మాస్ క్యారెక్టర్లో చూడబోతున్నాం. ఇప్పటి వరకు రిలీజైన పోస్టర్లు, టీజర్, ట్రైలర్లు సినిమాపై ఎక్కడలేని అంచనాలు క్రియేట్ చేశాయి. నానిని అలాంటి పాత్రలో చూస్తున్నామనే ఫీలింగే కొత్తగా అనిపిస్తుంది. ఎప్పుడెప్పుడు సినిమా చూస్తామా అని నాని ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకులు సైతం ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు.
శ్రీకాంత్ ఓదెలా దర్శకుడిగా పరిచయమవుతూ తెరకెక్కిన్న ఈ సినిమా మార్చి 30న పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ కాబోతుంది. కాగా తాజాగా ఈ సినిమా సెన్సార్ పూర్తయింది. సెన్సార్ దసరాకు యూ/ఏ సర్టిఫికేట్‌ను జారీ చేసింది. రెండు గంటల ఇరవైతొమ్మిది నిమిషాల రన్టైమ్తో ఈ సినిమా ప్రదర్శితం కానుంది. రన్ టైమ్ సినిమాకు కలిసొచ్చేలానే ఉంది. ఇప్పడున్న సమయంలో ఎంత కంటెంట్ ఉన్న సినిమా అయినా ఎక్కువ నిడివి ఉంటే ప్రేక్షకులు బోర్‌గా ఫీలవుతున్నారు. సినిమా మొత్తంలో రెండు, మూడు సీన్లు బోర్ కొట్టిచ్చినా సరే.. ఆ ఎఫెక్ట్ సినిమాపై పడే అవకాశం ఉంది. గతేడాది నాని నటించిన అంటే సుందరానికీ విషయంలో అదే జరిగింది. సినిమా ఎంతబాగా ఉన్నా.. రన్‌టైమ్ విషయంలో దెబ్బకొట్టింది. అది సినిమాపై చాలా ప్రభావం చూపించింది. ఇప్పుడు ఆదే తప్పు జరగకుండా దసరా విషయంలో మేకర్స్ కత్తెరకు పనిచెప్పినట్లు తెలుస్తుంది.