నాని, కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న సినిమా ‘దసరా’. శ్రీకాంత్ ఓదెల దర్శకుడు. పాన్ ఇండియా స్థాయిలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. సింగరేణి ప్రాంతమైన గోదావరిఖని దగ్గరలోని ఓ గ్రామ నేపథ్యంతో ఈ చిత్ర కథ సాగనుంది. ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మాస్ యాక్షన్ పాత్రలో నాని కనిపించనున్నారు. స్నేహితుల దినోత్సవం సందర్భంగా ఆదివారం ఈ చిత్రం నుంచి స్పెషల్ పోస్టర్ విడుదల చేశారు. దీనికి ‘ధూం ధాం దోస్తానా’ అనే క్యాప్షన్‌ను జత చేశారు. ప్రస్తుతం ఈ సినిమా రెగ్యులర్ చిత్రీకరణలో ఉంది. సముద్రఖని, సాయికుమార్, జరీనా వాహాబ్ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం : సంతోష్ నారాయణన్, ఎడిటర్ : నవీన్ నూలి, సినిమాటోగ్రఫీ : సత్యన్ సూర్యన్ ఐఎస్సీ.