Darshan | రేణుకాస్వామి క్షమించమని కోరినా దర్శన్ టీం కనికరించలేదా..? నెట్టింట ఫొటోల కలకలం
Darshan | రేణుకాస్వామి హత్యకేసులో పాపులర్ కన్నడ స్టార్ యాక్టర్ దర్శన్ (Darshan) అతడి స్నేహితురాలు నటి పవిత్రగౌడతోపాటు 16 మందిని పోలీసులు అరెస్ట్ చేశారని తెలిసిందే. వీరంతా ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. కాగా ఈ కేసులో నిందితులపై ఛార్జీషీట్ దాఖలు చేసిన పోలీసులు 24వ అదనపు మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఎదుట నివేదిక సమర్పించారు.
Darshan | రేణుకాస్వామి హత్యకేసులో పాపులర్ కన్నడ స్టార్ యాక్టర్ దర్శన్ (Darshan) అతడి స్నేహితురాలు నటి పవిత్రగౌడతోపాటు 16 మందిని పోలీసులు అరెస్ట్ చేశారని తెలిసిందే. వీరంతా ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. కాగా ఈ కేసులో నిందితులపై ఛార్జీషీట్ దాఖలు చేసిన పోలీసులు 24వ అదనపు మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఎదుట నివేదిక సమర్పించారు.
పవిత్ర గౌడకు సంబంధించిన అసభ్యకర ఫొటోలు పంపించాడన్న ఆరోపణల్లో రేణుకాస్వామిని బెంగళూరుకు 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిత్రదుర్గకు తీసుకెళ్లి దర్శన్ అండ్ టీం దారుణంగా హత్య చేసిందని తేలింది. పవిత్ర గౌడకు అసభ్యకరమైన సందేశాలు పంపాడన్న కారణంతో రేణుకా స్వామిని దారుణంగా కొట్టి, కరెంటు షాక్‌లు కొట్టినట్లు పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. శరీరంపై అనేక గాయాలను గుర్తించారు.
ఇదిలా ఉంటే తాజాగా బాధితుడు రేణుకాస్వామి చొక్కా లేకుండా కనిపిస్తున్న స్టిల్స్ నెట్టింట చక్కర్లు కొడుతూ.. కలకలం రేపుతున్నాయి.
రేణాకాస్వామి తనను క్షమించాలని వేడుకుంటుండగా.. దర్శన్ గ్యాంగ్ కనికరించకుండా దారుణంగా కొట్టి చంపినట్టుగా ఫొటోలు చూసిన నెటిజన్లు, జనాలు చర్చించుకుంటున్నారు. హత్య అనంతరం రేణుకా స్వామి మృతదేహాన్ని కామాక్షి పాల్య పీఎస్ పరిధిలోని సుమనహల్లి రోడ్ సైడ్ డంప్‌లో పడేశారు. మృతదేహాన్ని చూసిన ఓ సెక్యూరిటీ గార్డ్ పోలీసులకు సమాచారమందించారు. రేణుకాస్వామితల,ముఖం, డెడ్‌బాడీపై గాయాలు గుర్తించారు. ఈ ఫొటోలు
మొత్తం 3,991 పేజీలతో ఉన్న ఛార్జిషీట్లో ఏ1గా హీరోయిన్ పవిత్ర గౌడ, ఏ2గా హీరో దర్శన్ పేర్లను పేర్కొన్నారు. బెంగళూరు అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ చందన్ కుమార్ నేతృత్వంలోని సిట్ చార్జిషీట్‌ను కోర్టులో ఫైల్ చేసింది. ఈ సందర్భంగా ఫోరెన్సిక్ సైన్స్ లాబోరేటరీ నివేదికలను సైతం సిట్ చార్జిషీట్లో ప్రస్తావించింది. రేణుక స్వామి కిడ్నాప్, హత్య కేసులో ముగ్గురు ప్రత్యక్ష సాక్షులతో పాటు 231 మంది సాక్షులను విచారించినట్లు పోలీసులు పేర్కొన్నారు. 50 మందికిపైగా పోలీసులు, ఎనిమిది మంది వైద్యులు, 97 మంది సాక్షుల పేర్లను సైతం ప్రస్తావించారు.
Read Also :
Dil Raju | థంపింగ్ రెస్పాన్స్.. గేమ్ ఛేంజర్‌లో ఎస్జే సూర్య పాత్రపై దిల్ రాజు
Jr NTR | ఒకే ఫ్రేమ్‌లో రిషబ్ శెట్టి, ప్రశాంత్ నీల్, తారక్ ఫ్యామిలీ.. ఇంతకీ లొకేషన్ ఎక్కడో..!
Telugu Film Chamber | వరద బాధితుల కోసం తెలుగు ఫిలిం ఛాంబర్ భారీ విరాళం.. వివరాలివే
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

