సునీల్, అనసూయ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘దర్జా’. సలీమ్ మాలిక్ దర్శకత్వంలో శివశంకర్ పైడిపాటి నిర్మిస్తున్నారు. ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా శనివారం డేట్ అనౌన్స్మెంట్ లోగోను దర్శకుడు వీరశంకర్, సినీ పాత్రికేయులు ప్రభు, వినాయక రావు విడుదల చేశారు. నిర్మాత మాట్లాడుతూ ‘ఈ సినిమాలో అనసూయ పాత్ర వైవిధ్యంగా ఉంటుంది. యాక్షన్ ప్రధానంగా మెప్పించే మాస్ చిత్రమిది. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించే అంశాలుంటాయి’ అన్నారు. ఆమని, పృథ్వీ, అక్సాఖాన్, షమ్ము, అరుణ్వర్మ, శిరీష, షకలక శంకర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: దర్శన్, సంగీతం: రాప్రాక్ షకీల్, కథ: నజీర్, మాటలు: పి.రాజేంద్రకుమార్, నజీర్, భవానీప్రసాద్, స్క్రీన్ప్లే, దర్శకత్వం: సలీమ్ మాలిక్.