ఆదిత్య ఓం ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ‘దహనం’. డాక్టర్ శ్రీ పెతకంశెట్టి సతీష్ కుమార్ నిర్మిస్తున్నారు. ఆడారి మూర్తి సాయి దర్శకుడు. ఈ నెల 31న విడుదలకు సిద్ధమవుతున్నది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎఫ్డీసీ ఛైర్మన్ అనిల్ కూర్మాచలం, దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, నిర్మాత దామోదర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దర్శకుడు ఆడారి మూర్తి సాయి మాట్లాడుతూ…‘మూడు ప్రధాన పాత్రల చుట్టూ కథ సాగుతుంది. తరతరాలుగా పూజలు అందుకుని మూతబడిన శివాలయంలో మళ్లీ పూజలు చేయాలని ప్రయత్నించే వ్యక్తి పాత్రలో ఆదిత్య ఓం కనిపిస్తారు. అతని నటన సినిమాకు ఆకర్షణ అవుతుంది’ అన్నారు.