Daggubati Venkatesh | టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ రెండో కూతురు హవ్యవాహిని (Havyavahini) పెళ్లి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. విజయవాడకు చెందిన ఓ డాక్టర్ ఫ్యామిలీతో వెంకటేష్ వియ్యం అందుకున్నట్లు తెలుస్తుండగా.. నేడు వివాహం జరుగనుంది. ఈ నేపథ్యంలో గురువారం హవ్యవాహిని మెహందీ వేడుకను ఘనంగా నిర్వహించారు.
ఇక ఈ వేడుకల్లో సూపర్‌స్టార్ మహేశ్‌బాబు భార్య నమ్రతా శిరోద్కర్‌తో పాటు కూతురు సితార సహా పలువురుసినీ ప్రముఖులు హాజరై సందడిచేశారు. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలను నమ్రతా శిరోద్కర్ సోషల్ మీడియాలో పంచుకుంది. వెంకటేష్‌కు నలుగురు సంతానం. అందులో ముగ్గురు అమ్మాయిలు. చివరిగా కుమారుడు అర్జున్ జన్మించాడు. పెద్ద కుమార్తె ఆశ్రిత వివాహం నాలుగేళ్ల క్రితం 2019లో జరిగింది.
గతేడాది అక్టోబర్‌లో హవ్యవాహిని నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. ఈ వేడుకు మెగాస్టార్ చిరంజీవి, సూపర్‌స్టార్ మహేశ్‌బాబు, నాగ చైతన్య, దగ్గుబాటి రానా, సహా పలువురు రాజకీయ సినీ ప్రముఖులు హాజరై కొత్త జంటను ఆశీర్వదించారు.