Daddy | 2001లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా సురేష్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఫ్యామిలీ డ్రామా డాడీ. అప్పటి వరకు మాస్ చిత్రాలతో ప్రేక్షకులకి మాంచి కిక్ ఇచ్చిన చిరంజీవి సడెన్‌గా ఈ ఫ్యామిలీ డ్రామా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడంతో జనాలకి పెద్దగా ఎక్కలేదు. అయితే ఈ చిత్రంలో చిరంజీవి కూతురిగా ఓ చిన్నారి నటించి ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంది. అక్షయ అనే పాత్రలో ఆ చిన్నారి నటనకు ప్రతి ఒక్కరు ఫిదా అయ్యారు.. ‘అక్కి, డాడీ బోత్ ఆర్ ఫ్రెండ్స్’ అంటూ ముద్దుముద్దుగా పలికే ఆ చిన్నారి మాటలు ప్రేక్షకులను కట్టిపడేశాయి.
ఆ చిన్నారి పేరు అనుష్క మల్హోత్రా కాగా, ముంబైకి చెందిన ఈ చిన్నారి తన అమాయకపు చూపులతో, చక్కటి నటనతో అందరినీ కట్టిపడేసింది. డాడీ సినిమాలో నటించేటప్పటికి అనుష్క మల్హోత్రా వయసు నాలుగైదేళ్లు ఉంటాయి. అంటే, ఇప్పుడు ఈ చిన్నారి వయస్సు పాతికేళ్లపైనే ఉంటుంది. ముంబైలో పుట్టి పెరిగిన అనుష్క.. ప్రస్తుతం ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హామ్‌లో తల్లిదండ్రులతో కలిసి జీవిస్తున్నట్టు తెలుస్తుంది. అక్కడే గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి లండన్‌లో మార్కెటింగ్ స్ట్రాటజిస్ట్‌గా ఉద్యోగం చేస్తోంది. నిజానికి ‘డాడీ’ సినిమా తరవాత అనుష్క మల్హోత్రాకు బాలీవుడ్లో ఎన్నో అవకాశాలు వచ్చాయి.
కాని తల్లిదండ్రులు ఆమెని సినిమాలకి కాస్త దూరం ఉంచారు. ఆమె పూర్తిగా చదువుపైనే దృష్టిపెట్టింది. కుటుంబం కూడా బర్మింగ్‌హామ్ వెళ్లిపోవడంతో అక్కడే గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి ఉద్యోగం చేస్తోంది.అనుష్క కూడా తిరిగి సినిమాల్లోకి వచ్చేందుకు ఎప్పుడు ఆసక్తి చూపలేదు. ఒకవేళ ఆమె ఇండస్ట్రీలోకి తిరిగి వచ్చి ఉంటే మంచి హీరోయిన్ అయి ఉండేదని నెటిజన్స్ అంటున్నారు. ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్టులుగా మొదలపెట్టిన చాలా మంది హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులుగా సత్తా చాటుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. ఈ అమ్మడు సినిమాలతో సందడి చేయకపోయిన సోషల్ మీడియాలో కాక రేపేలా గ్లామర్ పిక్స్ షేర్ చేస్తూ రచ్చ చేస్తుంటుంది.