అడివి శేష్ హీరోగా నటిస్తున్న థ్రిల్లర్ చిత్రం ‘డెకాయిట్’ గ్లింప్స్‌ను సోమవారం విడుదల చేశారు. ఈ పాన్ ఇండియా చిత్రానికి షానియల్ డియో దర్శకుడు. మృణాల్ ఠాకూర్ కథానాయిక. నాయకానాయికలు అడవి శేష్, మృణాల్ ఠాకూర్ మధ్య భావోద్వేగభరిత సంభాషణతో మొదలైన గ్లింప్స్ ఆసక్తికరంగా సాగింది. ‘నేను మోసగించడానికి రాలేదు. అంతకంటే ఎక్కువ చేస్తా’ అంటూ మిస్టీరియస్ స్మైల్‌తో అడివి శేష్ చెప్పిన డైలాగ్ కథపై ఇంట్రెస్ట్‌ను పెంచింది. ఓ ఎపిసోడ్లో ఆయన ఖైదీ దుస్తుల్లో కనిపించారు.
ప్రేమ, ప్రతీకారం, మోసం అంశాల కలబోతగా సాగే థ్రిల్లర్ చిత్రమిదని, అడివి శేష్ ఇంటెన్స్ అండ్ రగ్గ్డ్ పాత్రలో కనిపిస్తారని, మృణాల్ ఠాకూర్ పాత్ర సైతం శక్తివంతంగా ఉంటుందని మేకర్స్ తెలిపారు. క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నది.