Sreeleela In D55 | ‘అమరన్’ చిత్రంతో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన దర్శకుడు రాజ్‌కుమార్ పెరియాసామి తన తర్వాతి చిత్రాన్ని ధనుష్‌తో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ధనుష్ కెరీర్లో 55వ చిత్రంగా (D55) వస్తున్న ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఒక క్రేజీ అప్డేట్ వెలువడింది. ఈ సినిమాలో టాలీవుడ్ సెన్సేషనల్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్గా ఎంపికయ్యారు. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ ‘వండర్‌బార్ ఫిల్మ్స్’ శనివారం అధికారికంగా ప్రకటిస్తూ, ధనుష్ మరియు శ్రీలీల టీమ్ సభ్యులతో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
ఇప్పటికే శివకార్తికేయన్ సరసన ‘పరాశక్తి’ సినిమాతో కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన శ్రీలీల, ఇప్పుడు ఏకంగా ధనుష్ పక్కన నటించే గోల్డెన్ ఛాన్స్ దక్కించుకోవడం విశేషం. రాజ్‌కుమార్ పెరియాసామి ఈ చిత్రంలో సమాజంలో కలిసిపోయి ఉండే కొందరు అజ్ఞాత వీరుల కథను చూపించబోతున్నారని సమాచారం. మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి ఈ చిత్రంలో ఒక కీలక పాత్ర పోషించనున్నట్లు వార్తలు వస్తుండగా, రీసెంట్ మ్యూజిక్ సెన్సేషన్ సాయి అభ్యాంకర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ‘అమరన్’ లాంటి ఎమోషనల్ హిట్ తర్వాత రాజ్‌కుమార్ తెరకెక్కిస్తున్న యాక్షన్ డ్రామా కావడంతో, ఈ కొత్త కాంబినేషన్‌పై అటు కోలీవుడ్, ఇటు టాలీవుడ్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
You didn’t see this coming 😉
Welcoming the dazzling damsel @sreeleela14 on board #D55 🔥@dhanushkraja @Rajkumar_KP @wunderbarfilms @RTakeStudios @SaiAbhyankkar @Shra2309 @azy905 @theSreyas @sandy_sashr @vishurams pic.twitter.com/fROtGwO0T2
— Wunderbar Films (@wunderbarfilms) January 31, 2026