Thalaivar 170 | ఏడు పదుల వయస్సు దాటినా కుర్ర హీరోలకు ఏ మాత్రం తగ్గకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నాడు తమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్ (Rajinikanth). రజినీకాంత్ ప్రస్తుతం నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తలైవా 169వ ప్రాజెక్ట్ జైలర్ సినిమాలో నటిస్తున్నాడు. మరోవైపు జై భీమ్ ఫేం టీజే జ్ఞానవేళ్ (TJ Gnanavel) దర్శకత్వంలో తెరకెక్కుతున్న తలైవా 170 (Thalaivar 170)లో కూడా నటిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి నెట్టింట హల్ చల్ చేస్తోంది. స్టార్ హీరో చియాన్ విక్రమ్ (Vikram)ను ఈ సినిమా కోసం సంప్రదించాడట టీజే జ్ఞానవేళ్.
ఇంతకీ స్పెషల్ రోల్ ఏదైనా చేయమన్నాడనుకుంటున్నారా..? అదేం కాదు.. ఈ చిత్రంలో విలన్ పాత్ర కోసం విక్రమ్‌ను సంప్రదించగా.. నో చెప్పాడని టాక్ నడుస్తోంది. అయితే ఈ విషయమై ఇంకా చర్చలు కొనసాగుతున్నాయని వార్తలు వస్తుండగా.. మరి విక్రమ్-రజినీకాంత్ కాంబో సిల్వర్ స్క్రీన్‌పై వస్తే బాగుంటుందని అనుకుంటున్నారు సినీ జనాలు. మరి రానున్న రోజుల్లో ఈ క్రేజీ కాంబోపై ఏదైనా అప్డేట్ వస్తుందేమో అభిమానుల్లో క్యూరియాసిటీ పెంచేస్తుంది. ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ (Lyca Productions) బ్యానర్‌పై సుబాస్కరన్ నిర్మిస్తున్నారు.
ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. తలైవా 170 ప్రాజెక్ట్ 2024లో థియేటర్లలో సందడి చేయనుంది. టీజే జ్ఞానవేళ్ సూపర్ స్టార్ రజినీకాంత్‌ను సిల్వర్ స్క్రీన్‌పై ఎలాంటి పాత్రలో చూపించబోతున్నాడన్నది ఆసక్తికరంగా మారింది. యాక్షన్ కామెడీ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కుతున్న జైలర్‌లో కన్నడ స్టార్ హీరో శివరాజ్‌కుమార్, రమ్యకృష్ణ, యోగిబాబు, మోహన్ లాల్, సునీల్, తమన్నా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన జైలర్ గ్లింప్స్ వీడియోతోపాటు మోహన్ లాల్, సునీల్, తమన్నా ఫస్ట్ లుక్ పోస్టర్లు నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి.