Crazy Kalyanam | ‘క్రేజీ కళ్యాణం’ రివ్యూ.. అనుపమ, తరుణ్ భాస్కర్ల సినిమా ఎలా ఉంది?
Crazy Kalyanam | దసరా పండగ బరిలో నిలిచిన తాజా చిత్రం 'క్రేజీ కళ్యాణం'. అనుపమ పరమేశ్వరన్, నరేశ్ వీకే, తరుణ్ భాస్కర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ రూరల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
Crazy Kalyanam | దసరా పండగ బరిలో నిలిచిన తాజా చిత్రం ‘క్రేజీ కళ్యాణం’. అనుపమ పరమేశ్వరన్, నరేశ్ వీకే, తరుణ్ భాస్కర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ రూరల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు అలరించిందో రివ్యూలో చూద్దాం.
కథ
పర్వతాలు (నరేశ్ వీకే) తన ఇద్దరు కూతుళ్లలో పెద్ద కూతురికి తాగుడుకు బానిసైన బాలరాజు (తరుణ్ భాస్కర్)తో పెళ్లి చేసి ఇబ్బందులు పడుతుంటాడు. దీంతో తన చిన్న కూతురు కీర్తి (అనుపమ పరమేశ్వరన్) కి మంచి ఆస్తిపాస్తులున్న యూఎస్ కుర్రాడితో పెళ్లి చేసి తన పరువు నిలబెట్టుకోవాలనుకుంటాడు. అయితే స్వతంత్ర భావాలున్న కీర్తి మాత్రం ప్రభుత్వ ఉద్యోగం సాధించి, తాను ప్రేమించిన ఉదయ్ (అఖిల్ రాజ్)ను పెళ్లి చేసుకోవాలని భావిస్తుంది. తండ్రి ఆశలకు, కూతురు లక్ష్యాలకు మధ్య జరిగే ఈ సంఘర్షణలో చివరకు గెలుపు ఎవరిది? అసలు ఈ పెళ్లి కథ ఎటువంటి మలుపులు తిరిగింది? అన్నదే ఈ చిత్ర కథాంశం.
విశ్లేషణ
తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో తండ్రీకూతుళ్ల అనుబంధం, ప్రేమకథ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు దర్శకుడు భద్రప్ప గాజుల. ప్రతి తండ్రి కూతురి పెళ్లికి చేసే ఖర్చులో కొంత భాగం చదువుకు కేటాయించాలనే మంచి సామాజిక సందేశాన్ని ఈ సినిమా ద్వారా చెప్పే ప్రయత్నం చేశారు. మొదటి భాగంలో ఫ్యామిలీ ఎమోషన్స్, తాగుబోతు అల్లుడితో వచ్చే సరదా సన్నివేశాలతో సినిమా కాస్త ఫన్ టోన్‌తో ప్రారంభమవుతుంది. లవ్ ట్రాక్ రొటీన్‌గా అనిపించినా, విరామ సమయానికి వచ్చే సన్నివేశాలు ఆసక్తిని కలిగిస్తాయి. సెకండాఫ్‌లో కథ కొన్ని చోట్ల నెమ్మదిస్తుంది. ముఖ్యంగా స్పోకెన్ ఇంగ్లీష్ ఎపిసోడ్స్ ఆశించిన స్థాయిలో నవ్వులు పంచలేకపోయాయి. అయితే ప్రీ-క్లైమాక్స్ నుంచి వచ్చే భావోద్వేగ సన్నివేశాలు, తండ్రీ కూతుళ్ల మధ్య వచ్చే ఎమోషన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. క్లైమాక్స్ కాస్త రొటీన్‌గా అనిపించినప్పటికీ, ఆడపిల్లల చదువు ప్రాముఖ్యతను తెలుపుతూ ముగించిన తీరు బాగుంది.
నటీనటులు
అనుపమ పరమేశ్వరన్ ఆత్మాభిమానం ఉన్న యువతిగా, తెలంగాణ యాసలో చక్కటి అభినయం ప్రదర్శించారు. ముఖ్యంగా ఎమోషనల్ సీన్లలో ఆమె నటన హైలైట్‌గా నిలిచింది. నరేశ్ వీకే తన అనుభవంతో సినిమాను మోశారు. కూతురి పెళ్లి కోసం తపించే మధ్యతరగతి తండ్రిగా ఆయన కామెడీ మరియు సెంటిమెంట్ పండించిన తీరు సినిమాకు ప్రధాన బలం. తరుణ్ భాస్కర్ తనదైన మేనరిజంతో నవ్వులు పంచగా, అఖిల్ రాజ్ తన పాత్ర పరిధి మేరకు నటించారు.
సాంకేతికంగా
తెలంగాణ పల్లెటూరి వాతావరణాన్ని, పండగ వాతావరణాన్ని కెమెరాలో ఎంతో సహజంగా బంధించారు సినిమాటోగ్రాఫర్ శ్యామ్ దూపాటి. సురేశ్ బొబ్బిలి అందించిన సంగీతం సినిమాకు ప్లస్ అయింది. ప్రత్యేకించి ‘అలచంద్ర వంక’ పాట శ్రోతలను ఎంతగానో ఆకట్టుకుంది, తెరపై కూడా చాలా కలర్ఫుల్గా వచ్చింది. నిర్మాత బూసం జగన్మోహన్ రెడ్డి కథా డిమాండ్‌కు తగినట్లుగా ఎక్కడా రాజీ పడకుండా ఖర్చు పెట్టారు.
బలాలు: అనుపమ, నరేశ్ నటన; బలమైన తండ్రి-కూతురు సెంటిమెంట్.
బలహీనతలు: రొటీన్ కథనం; ఆకట్టుకోని లవ్ ట్రాక్.
చివరిగా కథలో కొత్తదనం లేకపోయినా, మంచి ఎమోషన్స్ మరియు నటీనటుల అభిన కోసం ఈ పండగకు ఒకసారి చూడదగ్గ చిత్రం ‘క్రేజీ కళ్యాణం’.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ENE Repeat | ‘ఈఎన్ఈ రిపీట్’ అందరూ కలిసి ఎంజాయ్ చేసేలా ఉంటుంది.. ట్రైలర్ లాంచ్‌లో తరుణ్ భాస్కర్!
Pocket Rockets | నిహారిక కొణిదెల ‘పాకెట్ రాకెట్స్’ టీజర్ విడుదల.. డిసెంబర్ 11న థియేటర్లలో సందడి!
Air Pollution | నగరాల్లో తీవ్రమవుతున్న వాయు కాలుష్యం.. జాగ్రత్తలు తప్పనిసరి అంటున్న నిపుణులు..
ఎంజీయూ హాస్టల్స్ డైరెక్టర్‌గా డా.జి లక్ష్మీప్రభ నియామకం
‘గొర్రెల కాపరులకు పింఛన్లు ఇవ్వాలి’
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

