Leo | కోలీవుడ్ నుంచి రాబోతున్న మోస్ట్ ఎవెయిటెడ్ చిత్రాల్లో ఒకటి లియో (Leo.. Bloody Sweet). దళపతి విజయ్ (Vijay), లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagaraj) కాంబినేషన్లో యాక్షన్ ఎంటర్టైనర్గా వస్తోంది. ఇప్పటికే మేకర్స్ లాంఛ్ చేసిన లియో ఫస్ట్ లుక్, టైటిల్ ప్రోమో గ్లింప్స్ వీడియో, నా రెడీ సాంగ్ నెట్టింట టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తోంది. దళపతి విజయ్, అనిరుధ్ రవిచందర్ కలిసి పాడిన నా రెడీ సాంగ్ నెట్టింట మిలియన్ల సంఖ్యలో వ్యూస్ రాబడుతోంది.
ఇదిలా ఉంటే ఇప్పుడు లియోకు సంబంధించిన క్రేజీ గాసిప్ ఒకటి ఇండస్ట్రీలో సర్కిల్లో చక్కర్లు కొడుతోంది. లోకేశ్ కనగరాజ్ లియోను రెండు పార్టులుగా తెరకెక్కిస్తున్నాడన్న వార్త ఒకటి అభిమానులను ఖుషీ చేస్తోంది. లేటెస్ట్ టాక్ ప్రకారం లియో ఫస్ట్ పార్టు ముగింపులో పార్టు 2 టీజర్ ఉండబోతుందట. లియో సీక్వెల్‌ను 2025-26 మధ్యకాలంలో విడుదల చేసే అవకాశాలున్నాయని టాక్.
ఖైదీ 2, విక్రమ్ 2 సీక్వెల్ వార్తలు కూడా ఇప్పటికే నెట్టింట హల్ చల్ చేస్తున్నాయని తెలిసిందే. మరి లోకేశ్ కనగరాజ్ ఈ క్రేజీ సీక్వెల్స్‌ను వన్ బై వన్ ఎలా ట్రాక్‌పైకి తీసుకొస్తాడనేది ప్రస్తుతానికి సస్పెన్స్ నెలకొంది. లియోకు సీక్వెల్ ఉండబోతున్నదన్న వార్త ప్రస్తుతానికి గాసిప్ అయినా.. ఈ న్యూస్‌ను మాత్రం తెగ ఎంజాయ్ చేస్తున్నారు మూవీ లవర్స్.
లియో షూటింగ్ పూర్తి చేసుకుంది. మిషన్ విజయవంతంగా ముగిసింది. అక్టోబర్ 19న థియేటర్లలో కలుద్దాం.. అంటూ మేకర్స్ విడుదల తేదీని ప్రకటించారని తెలిసిందే. లియో మూవీలో బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్, యాక్షన్ కింగ్ అర్జున్, ప్రియా ఆనంద్, మలయాళ నటి శాంతి మాయాదేవి, మన్సూర్ అలీఖాన్, గౌతమ్ వాసు దేవ్‌మీనన్, మిస్కిన్, మాథ్యూ థామస్, సాండీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. యాక్షన్ జోనర్లో తెరకెక్కుతున్న లియో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.
ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ డైరెక్టర్. సెవెన్ స్క్రీన్ స్టూడియోపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి లోకేశ్ కనగరాజ్, రత్నకుమార్, ధీరజ్ వైడీ డైలాగ్స్ అందిస్తున్నారు. విజయ్, లోకేశ్ కనగరాజ్ కాంబోలో మాస్టర్ తర్వాత వస్తున్న రెండో సినిమా కావడంతో లియోపై అంచనాలు భారీగానే ఉన్నాయి.
Buzz:
• #ThalapathyVijay & #LokeshKanagaraj‘s #LEO is set to release in 2 parts 🔥🤯
• The conclusion of #LEO‘s first part will provide a teaser for Part 2 💥🤜🏻🤛🏻
• The release is planned for 2025-2026, subject to the success of other films 👌🏻
• Other films include… pic.twitter.com/19ZVvV2sT4
— KARTHIK DP (@dp_karthik) August 8, 2023
నా రెడీ ఫుల్ లిరికల్ వీడియో సాంగ్..
నా రెడీ సాంగ్ ప్రోమో..
లియో టైటిల్ ప్రోమో..