టాలీవుడ్ (Tollywood) హీరో రవితేజ (Ravi Teja), సుధీర్ శర్మ (Sudheer Varma) దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. రవితేజ 70వ (Ravi Teja 70) చిత్రానికి రావణాసుర టైటిల్‌ను ఫైనల్ చేశారు. టైటిల్‌కు తగ్గట్టు పది తలల రావణాసురుడిని గుర్తుకు తెచ్చేలా ఉన్న రవితేజ లుక్ ఇప్పటికే విడుదలవగా…అద్బుతమైన స్పందన వచ్చింది. మాస్ మహారాజా అభిమానుల కోసం మేకర్స అదిరిపోయే అప్ డేట్ అందించారు.
మూవీ లాంఛ్ ఈవెంట్‌ను జనవరి 14న సంక్రాంతి సందర్భంగా ఉదయం 9.50 గంటలకు హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో గ్రాండ్‌గా నిర్వహించనున్నట్టు ప్రకటించారు. ఈ చిత్రంలో రవితేజ లాయర్‌గా నటించనున్నాడు. యాక్షన్ థ్రిల్లర్‌గా నవలా కథాంశం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పలువురు ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలపై త్వరలోనే స్పష్టత రానుంది.
అభిషేక్ పిక్చర్స్, ఆర్టీ టీమ్‌వర్క్స్ బ్యానర్‌పై అభిషేక్‌నామా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రవితేజ మరోవైపు రమేశ్ వర్మ దర్శకత్వంలో ఖిలాడీ సినిమా చేస్తున్నాడు. దీంతోపాటు శరత్ మండవతో రామారావు చిత్రం చేస్తున్నాడు.