Actor Nani | నాని నిర్మాణంలో వస్తున్న తాజా చిత్రం ‘కోర్ట్: స్టేట్ వర్సెస్ ఎ నోబడీ’(Court: State vs A Nobody). ఈ సినిమాకు రామ్ జగదీశ్ దర్శకత్వం వహిస్తుండగా.. హర్ష్ రోషన్, శ్రీదేవి జంటగా నటిస్తున్నారు. ప్రియదర్శి, శివాజీ, సాయికుమార్, రోహిణి, హర్ష వర్ధన్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. యదార్థ సంఘటనల ఆధారంగా రాబోతున్న ఈ చిత్రం మార్చి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మూవీ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు.
ఈ ట్రైలర్ చూస్తుంటే.. కోర్ట్ డ్రామాగా రాబోతున్నట్లు తెలుస్తుంది. తన కూతరుని ప్రేమించాడన్న కారణంతో ఒక తండ్రి ఆ యువకుడిని జైలులో వేయించి బయటికి రాకుండా తన జీవితం నాశనం చేయాలనే కథతో ఈ సినిమా రాబోతుంది. న్యాయం కోసం సాగే పోరాటం అనే థీమ్‌తో రాబోతున్న ఈ ట్రైలర్ ఇంట్సెనివ్గా సాగింది.