War 2 Movie | ఆగష్టు నెల మూవీ లవర్స్‌కి పండగనే చెప్పాలి. ఒకవైపు స్టార్ నటుడు విజయ్ దేవరకొండ కింగ్డమ్ అంటూ ఒక రోజు ముందుగానే బాక్సాఫీస్ వద్ద సందడి చేయబోతున్నాడు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రం స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా రాబోతుంది. అయితే ఈ సినిమా అనంతరం ఇండిపెండెన్స్ డే కానుకగా రెండు పెద్ద సినిమాలు థియేటర్లలో సందడి చేయబోతున్నాయి. ఒకవైపు తమిళం నుంచి కూలీ అంటూ రజనీకాంత్ రాబోతుండగా.. హృతిక్ రోషన్ వార్ 2 అంటూ రాబోతున్నాడు. దీంతో ఈ రెండు సినిమాల మధ్య గట్టి పోటి నెలకొనబోతుంది. ఒకవైపు కూలీ సినిమాకు లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించడం.. నాగార్జున, ఉపేంద్ర, సత్యరాజ్, ఆమిర్ ఖాన్ వంటి భారీ తారగణం ఉండటంతో ఈ సినిమాకు తమిళంతో పాటు తెలుగు, కన్నడలో మంచి బజ్ ఏర్పడింది.
మరోవైపు వార్ 2 సినిమాలో హృతిక్ రోషన్‌తో పాటు టాలీవుడ్ అగ్ర కథానాయకుడు ఎన్టీఆర్ కీలక పాత్రలో నటించడం అయాన్ ముఖర్జీ ఈ సినిమాకు దర్శకత్వం వహించడంతో పాటు యష్ రాజ్ బ్యానర్ నిర్మించడం నార్త్‌లో మంచి బజ్ వచ్చింది. అయితే ఈ రెండు సినిమాలు ఒకేరోజు వస్తుండటం మువీ లవర్స్‌కి పండగనే చెప్పాలి. మరోవైపు ఈ సినిమా రన్ టైంకి సంబంధించి ఒక వార్త వైరల్‌గా మారింది. కూలీ సినిమా 2 గంటల 50 నిమిషాల రన్‌టైంతో రాబోతుంటే.. వార్ 2 ఏకంగా 3 గంటల రన్‌టైంతో రాబోతున్నట్లు తెలుస్తుంది. దీంతో ఏ సినిమా ఎలా ఉంటుందా అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.