Coolie Promotions in | సూపర్ స్టార్ రజనీకాంత్, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్లో రాబోతున్న భారీ చిత్రం కూలీ(Coolie Movie). అగ్ర నటులు నాగార్జున, ఆమిర్ ఖాన్, ఉపేంద్ర, సత్యరాజ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం ఇండిపెండెన్స్ డే కానుకగా ఆగష్టు 14న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్‌ని వినుత్నంగా ప్లాన్ చేసింది చిత్రయూనిట్. ఇందుకోసం ప్రముఖ ఈ కామర్స్ వెబ్సైట్ అమెజాన్‌తో చేతులు కలిపింది చిత్రయూనిట్. దీంతో సాధారణ ప్రచార పద్ధతులకు భిన్నంగా, ‘కూలీ’ సినిమా పోస్టర్లను అమెజాన్ డెలివరీ బాక్సులపై ముద్రించి ప్రచారం చేస్తుంది చిత్రయూనిట్. దీంతో అమెజాన్ ద్వారా డెలివరీ అయ్యే ప్రతి ఆర్డర్ బాక్సులపై ‘కూలీ’ సినిమా పోస్టర్లు కనిపిస్తాయి. ఈ ఐడియాకు మంచి స్పందన లభిస్తుంది.
#CooliePromotions takes over Amazon delivery boxes! 📦🔥
The #Coolie fever is arriving at your doorstep in style!#Coolie releasing worldwide August 14th@rajinikanth @Dir_Lokesh @anirudhofficial #AamirKhan @iamnagarjuna @nimmaupendra #SathyaRaj #SoubinShahir @shrutihaasan… pic.twitter.com/Xo0fqC14oo— Sun Pictures (@sunpictures) August 6, 2025