Coolie | సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన తాజా చిత్రం కూలీ. ఇది మాఫియా నేపథ్యంలో తెరకెక్కింది. ఒక రిటైర్డ్ డాన్ (రజనీకాంత్) తప్పనిసరి పరిస్థితుల్లో మళ్ళీ మాఫియాలోకి అడుగు పెట్టాల్సి రాగా, ఆ తర్వాత అతను ఏం చేశాడనేదే చిత్ర కథ.క్రేజీ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా యాక్షన్ ఎంటర్టైనర్ కూలీకి సంబంధించి ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, పోస్టర్స్ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేశాయి. అయితే ఈ చిత్రానికి పోటీగా ఎన్టీఆర్- హృతిక్ రోషన్ నటించిన వార్ 2 చిత్రం విడుదల కానున్న నేపథ్యంలో వినూత్న ప్రమోషన్స్‌కి శ్రీకారం చుట్టారు కూలీ మేకర్స్. వారు చేపట్టిన ప్రమోషన్ స్టైల్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
ఇప్పటికే ఇంటర్వ్యూలు, మ్యూజిక్, పోస్టర్లతో ప్రమోషన్లు షురూ చేసిన మేకర్స్, ఇప్పుడు అమెజాన్ డెలివరీ కార్టన్ బాక్సులపై ‘కూలీ’ పోస్టర్లు ప్రింట్ చేయించడం ద్వారా ప్రేక్షకుల దృష్టిని మరింత ఆకర్షిస్తున్నారు. డెలివరీ తీసుకున్న వినియోగదారులు, తమ ఆర్డర్ బాక్సులపై రజినీ పోస్టర్ చూసి ఆశ్చర్యపోతున్నారు. నెట్లో దీనిపై పలువురు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటీ ప్రమోషన్లు కొత్తగా, క్రియేటివ్‌గా ఉన్నాయి అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ ఐడియాను సమర్థవంతంగా వినియోగించుకుంటూ, మేకర్స్ ఒక ప్రోమో వీడియో కూడా రిలీజ్ చేశారు. ఈ వీడియోలో ‘కూలీ’ థీమ్‌ని వినూత్నంగా ప్రెజెంట్ చేశారు. ఇది మాస్ అండ్ మార్కెటింగ్ మేజిక్ అనేలా ఫీల్ తెస్తోంది.
ఈ భారీ మాస్ యాక్షన్ డ్రామా ఆగస్ట్ 14న తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. రజినీ ఫ్యాన్స్‌కి ఇది మరో పండగే. ‘కబాలి’, ‘కాలా’, ‘జైలర్’ తరహాలోనే ఈ చిత్రం కూడా రజినీ మేనియా రిపీట్ చేస్తుందని అభిమానులు నమ్ముతున్నారు. పాన్ ఇండియా తారాగణం ఇందులో నటిస్తుండడంతో మూవీపై అంచనాలు పీక్స్‌లోనే ఉన్నాయి. ‘కూలీ’ రన్ టైమ్ 2.50 గంటలు అని తెలుస్తుంది. రజనీకి తెలుగులో క్రేజ్ ఉన్నప్పటికీ… నాగార్జున విలన్ రోల్ చేయడం వల్ల ‘కూలీసకి టాలీవుడ్లో మరింత క్రేజ్ ఏర్పడింది. ఇంకా ఆ సినిమాలో బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్, కన్నడ స్టార్ ఉపేంద్ర, మలయాళ నటుడు సౌబిన్ షాహిర్ కీలక పాత్రలు చేశారు. బుట్ట బొమ్మ పూజా హెగ్డే ప్రత్యేక గీతం ‘మోనికా…’లో సందడి చేయడం కూడా మూవీకి పలస్ అయింది.
The first time ever for an Indian movie!🔥#Coolie Promotions in full swing across India ! 💥#Coolie releasing worldwide August 14th @rajinikanth @Dir_Lokesh @anirudhofficial #AamirKhan @iamnagarjuna @nimmaupendra #SathyaRaj #SoubinShahir @shrutihaasan @hegdepooja @anbariv… pic.twitter.com/Cv30HD0MyQ
— Pen Movies (@PenMovies) July 30, 2025