Coolie Movie | సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం కూలీ. ఈ సినిమాకు లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తుండగా.. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మిస్తున్నాడు. ఈ చిత్రంలో నాగార్జున, ఆమిర్ ఖాన్, ఉపేంద్ర, సత్యరాజ్, శృతిహాసన్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం ఆగష్టు 14న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ కాగా హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. దీంతో ఈ సినిమా ఎలా ఉంటుందా అని అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
అయితే ఈ సినిమాకు సెన్సార్ బోర్డు ఏ (A) సర్టిఫికెట్ జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో తెలుగులో ఉన్న పలు థియేటర్ల యాజమాన్యం థియేటర్‌కి వచ్చే ప్రేక్షకులకి పలు సూచనలు జారీ చేసింది. ఈ సినిమాకు 18 ఏండ్ల లోపు వయసు ఉన్న వారికి అనుమతిలేదని ప్రకటించింది. అలాగే వయస్సును నిరుపించే ఏదైన గుర్తింపు కార్డు (ఆధార్ కార్డు) తప్పనిసరి అని తెలిపింది.
Please note: Coolie is an A-rated film, suitable only for viewers aged 18 and above, owing to its high-octane action and mature theme. pic.twitter.com/rLA8wNHmfL
— Prasads Multiplex (@PrasadsCinemas) August 12, 2025