Nayanthara | నయనతార రాజకీయాల్లోకి వస్తారా.. ప్రచారంపై భర్త విఘ్నేష్ శివన్ ఏమన్నారంటే!
Nayanthara | తమిళనాడు రాజకీయాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం పార్టీ చుట్టూ చర్చలు కొనసాగుతున్న నేపథ్యంలో.. సినీ తారలు నయనతార, త్రిష రాజకీయాల్లోకి వస్తారంటూ ప్రచారం మొదలైంది.
Nayanthara | తమిళనాడు రాజకీయాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం పార్టీ చుట్టూ చర్చలు కొనసాగుతున్న నేపథ్యంలో.. సినీ తారలు నయనతార, త్రిష రాజకీయాల్లోకి వస్తారంటూ ప్రచారం మొదలైంది. ముఖ్యంగా 2031 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నాటికి నయనతార ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెడతారనే ఊహాగానాలు వినిపించాయి. అయితే ఈ వార్తలపై నయనతార భర్త, దర్శకుడు విఘ్నేష్ శివన్ స్పందించారు. ప్రస్తుతం తమ దృష్టి పిల్లల పెంపకం, కుటుంబ బాధ్యతలు, వృత్తిపరమైన పనులపైనే ఉందని ఆయన పేర్కొన్నట్లు కథనాలు వెల్లడిస్తున్నాయి. కుటుంబంతో సమయం గడపడం, తమ పనులను సమర్థవంతంగా నిర్వహించడం తమకు సంతృప్తినిస్తోందనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేసారు.
ఈ కామెంట్స్ నేపథ్యంలో నయనతార రాజకీయ ప్రవేశంపై జరుగుతున్న ప్రచారానికి ప్రస్తుతానికి ఎలాంటి స్పష్టమైన ఆధారం కనిపించడం లేదు. అయితే, ఆమె రాజకీయాల్లోకి వస్తారా లేదా అనే అంశంపై నయనతార నుంచి అధికారిక ప్రకటన వెలువడితేనే పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కాగా, తమిళనాడులో సినీ రంగం, రాజకీయాలకు మధ్య సుదీర్ఘ అనుబంధం ఉంది. గతంలో ఎంజీఆర్, జయలలిత వంటి సినీ ప్రముఖులు రాజకీయాల్లో కీలక పాత్ర పోషించి ముఖ్యమంత్రులుగా పనిచేశారు. ఈ నేపథ్యంలో నటుడు విజయ్ రాజకీయాల్లోకి ప్రవేశించడం, ఆయన పార్టీ కార్యకలాపాలు సినీ అభిమానుల్లోనే కాకుండా రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తిని పెంచాయి.ఈ పరిణామాల నేపథ్యంలో నయనతార, త్రిష వంటి అగ్ర కథానాయికలు కూడా రాజకీయాల్లోకి వస్తారంటూ ఊహాగానాలు మొదలయ్యాయి.
అయితే, ప్రచారం ఒక్కటే రాజకీయ ప్రవేశానికి ఆధారం కాదని, సంబంధిత వ్యక్తుల అధికారిక ప్రకటనల కోసం వేచి చూడాల్సి ఉంటుందని పరిశీలకులు భావిస్తున్నారు. రాజకీయ ప్రవేశంపై ప్రచారం కొనసాగుతున్నప్పటికీ నయనతార ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్నారు. విభిన్న పాత్రలను ఎంచుకుంటూ దక్షిణాది చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును కొనసాగిస్తున్నారు. ఆమె నటిస్తున్న పలు చిత్రాలపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. నయనతార ప్రధాన పాత్రలో నటిస్తున్న భక్తిరస ఫాంటసీ చిత్రం ‘మూకుత్తి అమ్మన్ 2’లో ఆమె అమ్మవారి పాత్రలో కనిపించనున్నారు. సుందర్ సి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంపై అభిమానుల్లో అంచనాలు ఉన్నాయి.ఇవే కాకుండా ‘డియర్ స్టూడెంట్స్’, పీరియడ్ యాక్షన్ డ్రామా ‘రక్కాయి’, ‘మన్నంగట్టి సిన్స్ 1960’ వంటి చిత్రాలతో అలరించేందుకు సిద్ధమైంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nayanthara | నయనతార రాజకీయాల్లోకి వస్తారా.. ప్రచారంపై భర్త విఘ్నేష్ శివన్ ఏమన్నారంటే!
CJP Leaders: జంతర్ మంతర్ వద్ద సీజేపీ నేతలు సౌరవ్, ఆశుతోష్ అరెస్టు
Mimicry Artist Satyanarayana | ఓఆర్ఆర్పై ఘోర రోడ్డు ప్రమాదం.. ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్ సత్యనారాయణ మృతి
Harish Rao | ఉచిత విద్యుత్ కు ఎసరు పెట్టే కుట్ర.. రైతు డిస్కమ్ ఏర్పాటు జీవోపై హరీశ్‌రావు సీరియస్
Rahul Gandhi: రాహుల్ గాంధీ ‘సర్’ పిటీషన్లో 10 లోపాలు.. ఐడీ కార్డులు అడిగిన రిజిస్ట్రీ
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

