Comrade Kalyan | బాక్సాఫీస్ వద్ద శ్రీ విష్ణు ‘కామ్రేడ్ కళ్యాణ్’ జోరు.. హిట్‌గా నిలిచిన కామెడీ డ్రామా!
Comrade Kalyan | వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరిస్తున్న టాలీవుడ్ హీరో శ్రీ విష్ణు మరోసారి బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటారు. ఆయన నటించిన తాజా కామెడీ డ్రామా ‘కామ్రేడ్ కళ్యాణ్’ తొలి వారాంతంలో మంచి వసూళ్లను సాధించినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. విడుదలైన తొలిరోజు నెమ్మదిగా ప్రారంభమైన ఈ సినిమా.. సాయంత్రం ఆటల నుంచి పుంజుకుంది.
Comrade Kalyan | వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరిస్తున్న టాలీవుడ్ హీరో శ్రీ విష్ణు మరోసారి బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటారు. ఆయన నటించిన తాజా కామెడీ డ్రామా ‘కామ్రేడ్ కళ్యాణ్’ తొలి వారాంతంలో మంచి వసూళ్లను సాధించినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. విడుదలైన తొలిరోజు నెమ్మదిగా ప్రారంభమైన ఈ సినిమా.. సాయంత్రం ఆటల నుంచి పుంజుకుంది. సినిమాకు సానుకూల స్పందన రావడంతో ప్రేక్షకుల సంఖ్య పెరిగింది. దీంతో నాలుగు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అయిందని మేకర్స్ పోస్టర్ ద్వారా తెలియజేశారు. దసరా సెలవులు కూడా కలిసి రావడంతో ఈ సినిమా సూపర్ హిట్ కావడం ఖాయమనే అంచనాకు వస్తున్నారు.
శ్రీ విష్ణు సినిమాలంటేనే వినోదంతో పాటు విభిన్నమైన కథాంశాలు గుర్తుకొస్తాయి. ఈ క్రమంలో వచ్చిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కూడా ప్రేక్షకులను ఆకట్టుకునే కామెడీ డ్రామాగా నిలుస్తోంది. విడుదలైన మొదటి రోజు ప్రారంభంలో వసూళ్లు ఆశించిన స్థాయిలో లేకపోయినప్పటికీ, సాయంత్రం ఆటల నుంచి పరిస్థితి మెరుగుపడింది. తొలి వారాంతంలో ఈ సినిమా తన జోరును కొనసాగించింది. సాధారణంగా కొత్త సినిమాలకు వారాంతంలో ప్రేక్షకుల ఆదరణ కీలకంగా ఉంటుంది. ఈ విషయంలో ‘కామ్రేడ్ కళ్యాణ్’కు కలిసి రావడంతో బాక్సాఫీస్ వద్ద మంచి ప్రదర్శన కనబరిచినట్లు ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. చాలా సినిమాలకు సోమవారం నుంచి వసూళ్లు తగ్గడం సాధారణం. అయితే ‘కామ్రేడ్ కళ్యాణ్’ పనిదినాలలోనూ నిలకడను ప్రదర్శించింది. ఈ పరిణామంతో సినిమా హిట్ స్థాయికి చేరుకుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటికే ఈ చిత్రాన్ని కొనుగోలు చేసిన పంపిణీదారులు సేఫ్ సైడ్‌లో ఉన్నట్టు కథనాలు పేర్కొంటున్నాయి.
అయితే, సినిమా సూపర్‌హిట్‌గా నిలుస్తుందా లేదా అనేది రాబోయే రోజుల్లో వసూళ్లు ఏ స్థాయిలో కొనసాగుతాయనే అంశంపై ఆధారపడి ఉంటుంది. దసరా సందర్భంగా కొత్త సినిమాలు థియేటర్లలోకి వస్తున్న నేపథ్యంలో ‘కామ్రేడ్ కళ్యాణ్’ వాటి పోటీని తట్టుకుని ఎంతకాలం నిలబడుతుందన్నది కీలకంగా మారింది. ‘కామ్రేడ్ కళ్యాణ్’లో శ్రీ విష్ణు సరసన మహిమా నంబియార్ కథానాయికగా నటించారు. జనకిరామ్ మరెళ్ల ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. సత్య, రాధిక, సుదర్శన్, షైన్ టామ్ చాకో, ఉపేంద్ర లిమాయే, సాయిచంద్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Comrade Kalyan | బాక్సాఫీస్ వద్ద శ్రీ విష్ణు ‘కామ్రేడ్ కళ్యాణ్’ జోరు.. హిట్‌గా నిలిచిన కామెడీ డ్రామా!
Piyush Goyal | సీఈసీలకు పద్మ అవార్డుల్ని కాంగ్రెస్ లంచాలుగా ఇచ్చింది.. కేంద్ర మంత్రి పీయూష్ సంచలన ఆరోపణ
ఎంజీయూ పీజీ, ఎంబీఏ సెమిస్టర్ ఫలితాలు విడుదల
Jailer 2 | ఓటీటీ వివాదం.. ఆ మల్టీప్లెక్స్‌లలో ‘జైలర్ 2’ హిందీ వెర్షన్‌కు నో ఎంట్రీ!
Stock Market | భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్.. సెన్సెక్స్ 1,109 పాయింట్లు లాభం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

