CM Revanth Reddy | తెలంగాణ ఆత్మను ఒడిసిపట్టారు.. మొగిలయ్య మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి సంతాపం
CM Revanth Reddy | బలగం సినిమాలో తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు, కుటుంబ విలువలను కండ్లకు కట్టినట్టు చూపించిన ప్రముఖ జానపద కళాకారుడు మొగిలయ్య (Balagam Mogilaiah) మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. మొగిలయ్య మరణం బడుగుల సంగీత సాహిత్య రంగానికి తీరని లోటని సీఎం పేర్కొన్నారు.
CM Revanth Reddy | బలగం సినిమాలో తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు, కుటుంబ విలువలను కండ్లకు కట్టినట్టు చూపించిన ప్రముఖ జానపద కళాకారుడు మొగిలయ్య (Balagam Mogilaiah) మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. బేడ బుడగ జంగాల జానపద కళారూపం ‘శారద కథల’కు బహుళ ప్రాచుర్యం కల్పించి, ఆ కళకే గొప్ప బలగంగా నిలిచిన మొగిలయ్య మరణం బడుగుల సంగీత సాహిత్య రంగానికి తీరని లోటని సీఎం పేర్కొన్నారు.
వరంగల్ జిల్లా దుగ్గొండి మండల కేంద్రానికి చెందిన పస్తం మొగిలయ్య శారద తంబుర మీటుతూ, పక్కనే బుర్ర (డక్కీ) వాయిస్తూ ఆయన సతీమణి కొమురమ్మ పలు చోట్ల ఇచ్చిన అనేక ప్రదర్శనలు వెలకట్టలేనివన్నారు. తెలంగాణ ఆత్మను ఒడిసిపట్టిన “బలగం” సినిమా చివర్లో వచ్చే మొగిలయ్య పాట ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిందని సీఎం రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. ఈ బాధాకర సమయంలో పస్తం మొగిలయ్య సతీమణి కొమురమ్మతోపాటు వారి కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మొగిలయ్య వరంగల్‌లోని ఓ ప్రైవేటు దవాఖానలో చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారని తెలిసిందే.
Read Also :
KTR | మొగులన్నా.. నీ పాట తెలంగాణ బలగాన్ని మళ్లీ చాటింది: కేటీఆర్
Keerthy Suresh | తగ్గేదే లే.. బేబిజాన్ ప్రమోషన్స్‌లో మంగళసూత్రంతో కీర్తిసురేశ్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Horoscope | 17-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
మంత్రిగారి సిఫార్సు.. మహా కుంభకోణం వివేక గంగాధరం!
రైతన్నపై ఆంక్షలు.. కాలువల్లో మోటర్లు వాడొద్దు.. నీళ్లు తోడొద్దు
పోటీకి జంకేది లేదు.. ఎవరికైనా చట్టాలు ఒక్కటే.. మస్క్‌కు గట్టిగా కౌంటర్ ఇచ్చిన రిలయన్స్
రేవంత్ సర్కార్‌లో అన్నీ స్కామ్‌లే.. కార్మికుల సొమ్మునూ వదలట్లే
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

