దర్శకుడు శంకర్ సినిమాలంటే భారీతనానికి, సాంకేతికంగా అత్యున్నత ప్రమాణాలకు పెట్టింది పేరు. ప్రస్తుతం ఆయన రామ్‌చరణ్‌తో పాన్ ఇండియా చిత్రం ‘గేమ్ చేంజర్’ రూపొందిస్తున్న విషయం తెలిసిందే. రాజకీయ, సామాజికాంశాల కలబోతగా సందేశాత్మక కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో రామ్‌చరణ్ ద్విపాత్రాభినయంలో కనిపించనున్నారు. త్వరలో ఈ సినిమాకు సంబంధించిన క్లైమాక్స్ ఘట్టాలను తెరకెక్కించబోతున్నట్లు తెలిసింది.
దాదాపు వెయ్యిమంది ఫైటర్స్ పాల్గొనగా భారీ స్థాయిలో యాక్షన్ ఎపిసోడ్‌కు రూపకల్పన చేస్తున్నారని సమాచారం. ఇందుకోసం హైదరాబాద్ శివారు ప్రాంతంలో రెండు భారీ సెట్స్‌ను తీర్చిదిద్దారని, దాదాపు నెల రోజుల పాటు క్లైమాక్స్‌ను చిత్రీకరించబోతున్నారని చెబుతున్నారు. శంకర్ శైలి లావిష్ మేకింగ్, భావోద్వేగాలతో ఈ క్లైమాక్స్ సినిమాకు ప్రధానాకర్షణగా నిలుస్తుందని చెబుతున్నారు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.