అగ్ర కథానాయిక సమంత నటించిన ‘సిటాడెల్’ వెబ్‌సిరీస్ ట్రైలర్ ఇటీవలే విడుదలైంది. ఇందులో ఆమె గూఢచారి పాత్రలో కనిపించింది. స్పై ఏజెంట్‌గా మారకముందు సినీ నటి కావాలనే ప్రయత్నాలు చేసినట్లు ట్రైలర్లో చూపించారు. ఈ సీన్ గురించి ఓ ఇంటర్వ్యూలో సమంత మాట్లాడింది. ఈ సందర్భంగా తన తొలి సినిమా ‘ఏ మాయ చేశావే’ ఆడిషన్‌ను గుర్తుచేసుకుంది. ‘ఈ సిరీస్‌లో నేను ఆడిషన్ ఇచ్చే ఓ సన్నివేశం ఉంది. అందులో నేను నటనరాని అమ్మాయిగా కనిపించాలి. సింగిల్టేక్లోనే ఆ సీన్ ఓకే అయింది. ఎందుకంటే నేను ఇప్పటికీ యావరేజ్ నటినే (నవ్వుతూ). ఇంకా నటనలో పరిణితి సాధించే పనిలో ఉన్నాను. అయితే నా ఫస్ట్‌మూవీ ‘ఏ మాయ చేశావే’ కోసం మాత్రం అద్భుతంగా ఆడిషన్ ఇచ్చాను’ అని చెప్పింది సమంత. తన కెరీర్లో ఎన్నో విజయాలు ఉన్నా అవన్నీ టీమ్ ఎఫర్ట్స్ అని ఆమె పేర్కొంది. ‘ఒక సినిమా వెనక ఎంతో మంది నిపుణుల కృషి ఉంటుంది. మంచి టీమ్ ఉన్నప్పుడే మన ప్రతిభ బయటకు వస్తుంది. అదృష్టం కొద్ది నేను ప్రతిభావంతులైన నటీనటులు, సాంకేతిక నిపుణులతో కలిసి పనిచేశాను’ అని తెలిపింది. ‘సిటాడెల్’ సిరీస్ నవంబర్ 7 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది.