Salaar Movie | ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ క్రేజ్ అంతర్జాతీయ స్థాయిలో పెరిగింది. ఈయన నుంచి సినిమా వస్తుందంటే అభిమానులే కాదు ప్రతి సినీప్రేమికుడు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తుంటారు. ప్రభాస్ కూడా ఓకే జానర్లో సినిమాలు చేయకుండా ఆడియెన్స్ రుచికి తగ్గుట్టుగా కథలను ఎంపిక చేసుకుంటున్నాడు. ఇటీవలే విడుదలైన రాధేశ్యామ్ ప్రేక్షకులను తీవ్రంగా నిరాశపరిచింది. పీరియాడికల్ లవ్‌స్టోరిగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని రాధాకృష్ణ దర్శకత్వం వహించాడు. ఫైనల్‌గా ఈ చిత్రం సగం బడ్జెట్‌ను కూడా రికవరీ చేయలేకపోయింది. ఈ చిత్రం ఫలితంతో ప్రభాస్ తన తదుపరి సినిమాలపై జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.
ప్రభాస్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘సలార్’ సినిమాను చేస్తున్నాడు. ప్రభాస్ అభిమానుల ఆశలన్ని ఈ చిత్రంపైనే ఉన్నాయి. అంతే కాకుండా ఇటీవలే కేజీఎఫ్-2 సృష్టించిన విధ్వంసంతో ప్రశాంత్ నీల్‌పై అటు అభిమానులలో ఇటు ప్రేక్షకులలో సలార్‌పై తీవ్ర ఆసక్తి నెలకొంది. అయితే తాజాగా సినిమాటోగ్రాఫర్ భువనగౌడ సలార్ గురించి పలు ఆసక్తికర విషయాలను చెప్పాడు. సలార్ చిత్రం కేజీఎఫ్ కన్నా రెండు మూడు రేట్లు మించి ఉంటుందని.. కేజీఎఫ్ మేకింగ్, బ్యాక్‌డ్రాప్‌కు సలార్ పూర్తి భిన్నంగా ఉంటుందని తెలిపాడు. ఈ వాఖ్యలతో ప్రభాస్ అభిమానులు ఖుషి అవుతున్నారు.