ముంబై : లెజండరీ నటుడు దిలీప్ కుమార్ మృతి పట్ల బిగ్ బి అమితాబ్ బచ్చన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హింది సినిమా ఇక ఎప్పటికీ ఒకలా ఉండదన్నారు. ముంబైలోని హిందూజా హాస్పిటల్లో దిలీప్ కుమార్ ఇవాళ మృతిచెందిన విషయం తెలిసిందే. భారతీయ చలనచిత్ర రంగంలో ఓ వ్యవస్థ వెళ్లిపోయిందని, భారతీయ చిత్రసీమ గురించి చెప్పాలంటే.. దిలీప్ కుమార్ ముందు, దిలీప్ కుమార్ తర్వాత అని చెప్సాల్సి ఉంటుందని అమితాబ్ తన ట్వీట్లో తెలిపారు. దిలీప్ ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబానికి శక్తినివ్వాలని అమితాబ్ ప్రార్థించారు. ట్రాజిడీ కింగ్ దిలీప్ మృతి పట్ల విషాదం వ్యక్తం చేసిన అమితాబ్.. ఒక అసాధారణ యుగానికి తెరపడిందని, ఇది మళ్లీ ఎన్నటికీ రాదన్నారు. దిలీప్ కుమార్, అమితాబ్‌లు కలిసి 1983లో రిలీజైన శక్తి సినిమాలో నటించారు. బాలీవుడ్ నటులు అక్షయ్ కుమార్, అజయ్ దేవగన్, షారూఖ్ ఖాన్, అమిర్ ఖాన్.. దిలీప్ మృతి పట్ల నివాళి అర్పించారు.
T 3958 – An institution has gone .. whenever the history of Indian Cinema will be written , it shall always be 'before Dilip Kumar, and after Dilip Kumar' ..
— Amitabh Bachchan (@SrBachchan) July 7, 2021
My duas for peace of his soul and the strength to the family to bear this loss .. 🤲🤲🤲
Deeply saddened .. 🙏
To the world many others may be heroes. To us actors, he was The Hero. #DilipKumar Sir has taken an entire era of Indian cinema away with him.
— Akshay Kumar (@akshaykumar) July 7, 2021
My thoughts and prayers are with his family. Om Shanti 🙏🏻 pic.twitter.com/dVwV7CUfxh
Shared many moments with the legend…some very personal, some on stage. Yet, nothing really prepared me for his passing away. An institution, a timeless actor. Heartbroken.
— Ajay Devgn (@ajaydevgn) July 7, 2021
Deepest condolences to Sairaji🙏🏼#DilipKumar pic.twitter.com/Il8qaMOOhf