పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas ) నటిస్తోన్న చిత్రాల్లో ఒకటి ప్రాజెక్టు కే (Project K). సైన్స్ ఫిక్షన్ జోనర్లో రాబోతున్న ఈ చిత్రానికి మహానటి ఫేం నాగ్ అశ్విన్ (Nag Ashwin) దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్లో కొనసాగుతుంది. ఈ చిత్రానికి సంబంధించిన ఆసక్తికర అప్డేట్ బయటకు వచ్చింది. ఇంటర్నేషనల్ కొరియోగ్రాఫర్ శిఫు అశ్ (choreographer Shifu Ash) ఈ చిత్రానికి పనిచేయబోతున్నాడు. పోరాట నృత్యం సన్నివేశాల కోసం శిఫు అశ్ హైదరాబాద్కు వచ్చేశాడని టాలీవుడ్ సర్కిల్ టాక్.
మూమెంట్స్ ప్రాక్టీస్ , థియరీ, ఆధ్యాత్మికత, క్లిష్టమైన విద్యా విధానాన్ని అనుసంధానిస్తూ సాగుతుంది కంబాట్ డ్యాన్స్. మూమెంట్ రీసెర్చర్, ఎడ్యుకేటర్, కొరియోగ్రాఫర్ అంతర్జాతీయ నృత్య పరిశ్రమలో పాపులారిటీ సంపాదించుకున్నాడు శిఫు అశ్. ప్రాజెక్టు కేలో దీపికా పదుకొనే, అమితాబ్ బచ్చన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
మరోవైపు ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ప్రభాస్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న సలార్లో నటిస్తున్నాడు. 2023 వేసవి కానుకగా థియేటర్లలో గ్రాండ్గా విడుదల కానుంది. ప్రభాస్ ఇప్పటికే హార్రర్ థ్రిల్లర్ డ్రామాగా రాబోతున్న మారుతి సినిమాలో జాయిన్ కావాల్సి ఉండగా..ఇతర కమిట్ మెంట్స్ వల్ల ఆలస్యమవుతున్నట్టు టాలీవుడ్ సర్కిల్ టాక్. తానాజీ ఫేం ఓం రౌత్ డైరెక్షన్లో ఆదిపురుష్ సినిమా కూడా చేస్తున్నాడు ప్రభాస్.