SSMB 29 | దర్శక దిగ్గజం ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli), సూపర్ స్టార్ మహేశ్ బాబు కాంబోలో ఒక సినిమా రానున్న విషయం తెలిసిందే. బాహుబలి, ఆర్ఆర్ఆర్ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో ఈ మూవీ వస్తుండటంతో మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఎస్ఎస్ఎంబీ 29గా వస్తున్న ఈ ప్రాజెక్ట్ హాలీవుడ్ స్థాయికి ఏ మాత్రం తగ్గకుండా ఉంటుందని రాజమౌళి అప్పట్లో వెల్లడించాడు. అయితే ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు స్టార్ట్ కాబోతుందనే దానిపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు జక్కన్న. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి పోస్ట్ ప్రోడక్షన్ పనులతో పాటు నటినటుల ఎంపిక జరుగుతుంది. ఇప్పటికే ఈ మూవీలో
మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ నటించబోతున్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో పృథ్వీరాజ్ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం.
ఇదిలావుంటే తాజాగా ఈ సినిమాలో మరో స్టార్ హీరో నటించబోతున్నట్లు తెలుస్తుంది. ఈ చిత్రంలో తమిళ హీరో చియాన్ విక్రమ్ నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. రీసెంట్గా ఈ వార్తలపై విక్రమ్ స్పందించాడు. విక్రమ్ కథానాయకుడిగా వస్తున్న తాజా చిత్రం తంగలాన్. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా విక్రమ్ మీడియాతో ముచ్చటిస్తుండగా.. ఒక రిపోర్టర్ అడుగుతూ.. మహేశ్ – రాజమౌళి కాంబోలో వస్తున్న సినిమాలో మీరు నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై మీ రియాక్షన్ ఏంటి అని అడుగగా..
విక్రమ్ సమాధానమిస్తూ.. రాజమౌళి చాలా మంచి వ్యక్తి. ఆయన నేను అప్పుడప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం. ఎప్పుడైనా ఆయన దర్శకత్వంలో సినిమా చేస్తాను. అయితే మహేశ్ – రాజమౌళి కాంబోలో వస్తున్న సినిమాపై మేము ఇప్పటివరకు మాట్లాడలేదు. ఆ టాపిక్ కూడా రాలేదు అంటూ విక్రమ్ వెల్లడించాడు.
ఇక ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్‌కు రాజ్యసభ ఎంపి, రాజమౌళి తండ్రి వి.విజయేంద్ర ప్రసాద్ కథను అందిస్తుండగా.. ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం, పి.ఎస్.వినోద్ సినిమాటోగ్రఫీ.. వీఎఫ్ఎక్స్ సూపర్ వైజర్‌గా ఆర్.సి.కమల్ కణ్ణన్, ప్రొడక్షన్ డిజైనర్‌గా మోహన్ బింగి, ఎడిటర్‌గా తమ్మిరాజు, కాస్ట్యూమ్ డిజైనర్ & స్టైలిస్ట్‌గా రమా రాజమౌళి పని చేయనున్నట్లు సమాచారం. కాగా దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇండోనేషియాకు చెందిన హీరోయిన్ చెల్సియా ఎలిజబెత్ ఇస్లాన్ ఇందులో హీరోయిన్గా నటించే అవకాశాలున్నాయని సమాచారం.