వరుణ్‌సందేశ్, శీతల్భట్ జంటగా నటించిన సినిమా ‘చిత్రం చూడర’. ఆర్.ఎన్ హర్షవర్దన్ దర్శకుడు. శేషు మారంరెడ్డి, బోయపాటి భాగ్యలక్ష్మి నిర్మాతలు. ప్రముఖ నిర్మాత టి.జి.విశ్వప్రసాద్ శుక్రవారం టీజర్‌ను విడుదల చేశారు.
టీజర్ సస్పెన్స్, యాక్షన్ అంశాలతో ఆకట్టుకునేలావుందంటూ టీమ్‌కి విశ్వప్రసాద్ శుభాకాంక్షలు అందించారు. తనికెళ్ల భరణి, శివాజీరాజా, అల్లరి రవిబాబు, కాశీవిశ్వనాథ్, ధనరాజ్, రాజా రవీంద్ర, అన్నపూర్ణమ్మ, మీనాకుమారి తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: రథన్, కెమెరా: జవహర్‌రెడ్డి.