Kiran Abbavaram KA Movie | టాలీవుడ్ అగ్ర కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి ఏదైన సినిమా చూసిన అనంతరం తనకు నచ్చితే ఆ సినిమాను ప్రశంసిస్తూ పోస్ట్ పెట్టడమో లేదా.. మూవీ టీంను తన ఇంటికి పిలిపించుకొని అభినందించడం చేస్తూ ఉంటాడు అన్న విషయం తెలిసిందే. నిన్నటికి నిన్న ‘లక్కీ భాస్కర్’ సినిమా చూసి దర్శకుడు వెంకీ అట్లూరిని అభినందించిన చిరు తాజాగా ‘క’ సినిమా చూసి నటుడు కిరణ్ అబ్బవరంతో పాటు ‘క’ మూవీ టీం అందరిని ప్రత్యేకంగా అభినందించాడు.
చిన్న సినిమాగా వచ్చి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అందుకుంది క చిత్రం. టాలీవుడ్ యువ నటుడు కిరణ్ అబ్బవరం ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాకు సుజీత్, సందీప్ ఇద్దరు దర్శకులు సంయుక్తంగా దర్శకత్వం వహించగా.. కిరణ్ అబ్బవరం సోంత బ్యానర్‌పై వస్తున్న ఈ సినిమాను చింతా గోపాలకృష్ణ రెడ్డి భారీ బడ్జెట్‌తో నిర్మించారు. నయన్ సారిక కథానాయికగా నటించింది. దీపావళి కానుకగా అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది. తొలిరోజే రూ.6 కోట్ల వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం వారం రోజుల్లో రూ.50 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టినట్లు చిత్రబృందం తెలిపింది. కిరణ్ అబ్బవరంకు కూడా చాలా రోజుల తర్వాత హిట్ పడడంతో మూవీని చూడడానికి ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడుతున్నారు. ఇక ఇదే సినిమాను తాజాగా చూసిన మెగాస్టార్ చిరంజీవి మూవీ టీంని ఇంటికి ఇన్వైట్ చేసి ప్రత్యేకంగా అభినందించారు. కాగా ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్‌గా మారాయి.
@KChiruTweets watched #KA personally congratulated the team on the blockbuster success pic.twitter.com/WmTwm8Us3B
— Maduri Mattaiah Naidu (@madurimadhu1) November 10, 2024