మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) నటిస్తోన్న చిత్రాల్లో ఒకటి గాడ్ ఫాదర్ (Godfather). మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నాడు. లూసిఫర్‌కు రీమేక్‌గా వస్తున్న ఈ ప్రాజెక్టులో బాలీవుడ్ (Bollywood) స్టార్ హీరో సల్మాన్ ఖాన్ (Salman Khan) కీలక పాత్ర పోషిస్తున్నాడు. ముంబైలో వేసిన స్పెషల్ సెట్స్‌లో సల్మాన్, చిరంజీవిపై వచ్చే పాట షూటింగ్ స్టిల్స్ ఇప్పటికే నెట్టింట్లో ట్రెండింగ్ అయ్యాయి.
తాజాగా ఈ ఇద్దరు స్టార్ హీరోల లీక్డ్ స్టిల్ అంటూ ఓ లుక్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. చిరు, సల్లూభాయ్ చేతుల్లో గన్స్ పట్టుకుని స్టైలిష్ కనిపిస్తున్న లుక్ చూసి చాలా ఎక్జయిట్మెంట్కు లోనవుతున్నారు అభిమానులు. ఈ చిత్రంలో నయనతార ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తుండగా..సత్యదేవ్ కీ రోల్ పోషిస్తున్నాడు.
సూపర్ గుడ్ ఫిలిమ్స్-కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి థమన్ మ్యూజిక్ డైరెక్టర్. ఈ చిత్రాన్ని అక్టోబర్ 5న రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు మేకర్స్. చిరంజీవి మరోవైపు మెహర్ రమేశ్ డైరెక్షన్లో చేస్తున్న భోళాశంకర్, బాబీ (కేఎస్ రవీంద్ర) డైరెక్షన్లో చేస్తున్న మెగా 154 సినిమాలు కూడా సెట్స్ పై ఉన్నాయి. ఈ చిత్రానికి వాల్తేరు వీరయ్య టైటిల్‌ను పరిశీలిస్తున్నారు మేకర్స్.