Chiru- Bobby | బ్లాక్‌బస్టర్ విజయం సాధించిన ‘వాల్తేరు వీరయ్య’ తర్వాత, మెగాస్టార్ చిరంజీవి , ప్రముఖ దర్శకుడు బాబీ కలయికలో రాబోతున్న కొత్త సినిమా పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను నవంబర్ 5వ తేదీని పూజ కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించనున్నారన్న సమాచారం చిత్రం వర్గాల నుండి వెల్లడైంది.పూర్తిస్థాయి యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కనున్న ఈ సినిమాలో చిరంజీవి సరసన హీరోయిన్గా యంగ్ బ్యూటీ మాళవిక మోహనన్ని ఎంపిక చేశారు. ఇప్పటికే ప్రభాస్ సరసన నటించి, ‘తంగలాన్’లో విక్రమ్, మలయాళంలో మోహన్‌లాల్ వంటి సీనియర్ స్టార్లతో పనిచేసి మంచి గుర్తింపు తెచ్చిన మాళవిక, ఇప్పుడు మెగాస్టార్‌తో జతకట్టే అవకాశం దక్కించుకుంది.
ప్రముఖ కన్నడ నిర్మాణ సంస్థ KVN ప్రొడక్షన్స్ నిర్మించనున్న ఈ చిత్రానికి ‘మిరాయ్’ చిత్ర దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తించనుండడం విశేషం. చిరంజీవి పుట్టినరోజున అధికారికంగా ప్రకటించిన ఈ ప్రాజెక్ట్‌పై మెగా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మలయాళ బ్యూటీ మాళవిక ఇటీవల వరుసగా తెలుగు ప్రాజెక్ట్స్‌లో చోటు దక్కించుకుంటుండడం చూస్తుంటే రానున్న రోజులలో ఈ భామ టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేయడం ఖాయంగా కనిపిస్తుంది. మరోవైపు బాబీ – చిరు చిత్రంలో రాశీ ఖన్నా కూడా నటించనుందని సమాచారం. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం చిరంజీవి వరుస సినిమాలతో ఫుల్ జోష్ మీద ఉన్నారు. యంగ్ డైరెక్టర్ వసిష్ఠతో ‘విశ్వంభర’ చిత్రాన్ని పూర్తి చేశారు. మరోవైపు సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో చేస్తున్న సినిమా చివరి దశ చిత్రీకరణలో ఉంది. ఈ రెండు ప్రాజెక్టులు పూర్తికాకముందే బాబీతో మరో సినిమాను మొదలుపెడుతున్న ఆయన స్పీడ్‌కు అద్దం పడుతోంది.
కాగా, చిరంజీవి- అనీల్ రావిపూడి దర్శకత్వంలో మన శంకర వరప్రసాద్ గారు అనే చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో నయనతార కథానాయికగా నటిస్తుంది. రీసెంట్గా మీసాల పిల్ల అనే సాంగ్ మూవీ నుండి విడుదల కాగా, దీనికి మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. ప్రస్తుతం ఈ సాంగ్ యూట్యూబ్‌ని షేక్ చేస్తుంది. సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుందని తెలుస్తోంది.