Chiru-Balayya | ఇటీవలి కాలంలో మల్టీ స్టారర్ చిత్రాలు ఎక్కువగా వస్తున్నాయి. టాప్ హీరోలు కూడా కలిసి పని చేస్తున్నారు. అయితే చిరంజీవి-బాలయ్య కాంబినేషన్లో ఓ సినిమా వస్తే చూడాలని ఫ్యాన్స్ ఎంతగానో కోరుకుంటున్నారు. మెగాస్టార్ చిరంజీవి, నటసింహ బాలకృష్ణ.. ఇద్దరూ లార్జర్ దెన్ లైఫ్ ఇమేజ్ ఉన్న టాలీవుడ్ హీరోలు. తెలుగు రాష్ట్రాల్లో వీరిద్దరికీ ఉన్న అభిమాన గణం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ ఇద్దరు హీరోలు ఎన్నోసార్లు థియేటర్లలో ఒకేసారి సినిమాలు విడుదల చేసి పోటీ పడ్డారు. అయినప్పటికీ అద్భుతమైన వసూళ్లతో సరికొత్త రికార్డులు సృష్టించారు.
విడివిడిగా పోటీ చేసి బాక్సాఫీస్ షేక్ చేసిన చిరంజీవి, బాలయ్య కలిసి సినిమా చేస్తే ఎలా ఉంటుంది. బొమ్మ దద్దరిల్లిపోవడం ఖాయం. ఆ మధ్య చిరంజీవి ఓ సందర్భంలో బాలయ్యతో కలిసి సినిమా చేయాలనే కోరికని వ్యక్తం చేశారు. చిరు-బాలయ్య కలిసి నటిస్తామంటే.. ఏ నిర్మాత ఆ అవకాశాన్ని వదులుకుంటారని మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు. ప్రశ్నించారు. ఒక మంచి కథ దొరికితే.. ఆ దిశగా ప్రయత్నాలు చేస్తామన్నారు. అయితే ఈ ఇద్దరి కోసం హోరా హోరీగా ఇమేజ్ లు బ్యాలెన్స్ చేస్తూ కథ రాయగలగాలి. ఇందుకోసం ప్రయత్నాలు జరుగుతన్నాయి అనేది టాక్. చిరంజీవి, బాలయ్య తో భారీమల్టీ స్టారర్ కోసం బోయపాటి శ్రీనును డైరెక్టర్ గా తీసుకోబోతున్నారు అని అప్పట్లో ఓ ప్రచారం జరిగింది.
అందులో నిజమెంత ఉందో కాని ఇప్పుడు మాత్రం వారిద్దరిని కలిపేందుకు రజనీకాంత్ ఓ అడుగు ముందుకు వేశాడట.తమిళ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా ‘జైలర్ 2’కి సన్నాహాలు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో స్టార్ హీరోలు నటిస్తారని ముందే అర్ధమైంది. ‘జైలర్’ లో కొనసాగిన మోహన్ లాల్, శివరాజ్ కుమార్ తో పాటు మరింత మంది స్టార్స్ యాడ్ అవుతారని కోలీవుడ్ మీడియాలో ప్రచారం జరిగింది. టాలీవుడ్ నుంచి బాలకృష్ణ రంగంలోకి దింపినట్టు టాక్. అలానే చిరు కూడా ఓ ముఖ్య పాత్రలో కనిపించబోతున్నారట. నెల్సన్ దిలీప్ కోరిక మేరకు ఓ పవర్ ఫుల్ పాత్రలో నటించమని రజనీకాంత్ స్వయంగా చిరంజీవికి కాల్ చేసి అడగడంతో ఆయన మాట కాదనలేక చిరు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు టాక్. ఇదే నిజమైతే కోలీవుడ్‌కి ఇంత కాలం సాధ్యం కాని వెయ్యి కోట్ల క్లబ్ జైలర్2 తో అవుతుంది.