Chiranjeevi’s Mother Anjana Devi Hospitalized | మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనాదేవి మరోసారి అస్వస్థతకు గురైయినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి ప్రస్తుతం వార్తలు వైరల్ అవుతున్నాయి. మంగళవారం తెల్లవారుజామున అంజనాదేవి అస్వస్థతకు గురవడంతో కుటుంబసభ్యులు నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించినట్లు తెలుస్తోంది. వైద్యులు చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. అయితే, ఈ విషయంపై మెగా ఫ్యామిలీ నుంచి అధికారికంగా ఎలాంటి ప్రకటనా వెలువడలేదు. మరోవైపు అమరావతిలో కేబినెట్ మీటింగ్ జరుగుతుండగా.. తల్లి అనారోగ్యం విషయం తెలుసుకున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హుటాహుటిన బయలుదేరి హైదరాబాద్కి వస్తున్నట్లు తెలుస్తోంది. . కొణిదెల వెంకటరావును వివాహం చేసుకున్న అంజనాదేవి.. ఐదుగురికి జన్మనిచ్చింది. ఇందులో మొదటి సంతానం చిరంజీవి కాగా.. ఆ తర్వాత విజయ దుర్గ కొణిదెల, కొణిదెల మాధవి, కొణిదెల నాగేంద్రబాబు, కొణిదెల పవన్ కళ్యాణ్ ఉన్నారు.