God Father Movie | ‘గాడ్‌ఫాదర్’ ట్రైలర్ టైమ్ ఫిక్స్.. రిలీజ్ ఎన్నిటికంటే?
God Father Tariler Announced | ‘ఆచార్య’ వంటి భారీ ఫేయిల్యూర్ తర్వాత ‘గాడ్‌ఫాదర్’తో చిరు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఇప్పటికే చిత్రం నుండి విడుదలైన ఫస్ట్‌లుక్ పోస్టర్ నుండి ఇటీవలే విడుదలైన టీజర్ వరకు ప్రతీది సినిమాపై అంతకంతకు అంచనాలను పెంచుతూనే ఉన్నాయి. ఈ చిత్రాన్ని తమిళ దర్శకుడు మొహన్‌రాజా తెరకెక్కించాడు.
God Father Tariler Announced | ‘ఆచార్య’ వంటి భారీ ఫేయిల్యూర్ తర్వాత ‘గాడ్‌ఫాదర్’తో చిరు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఇప్పటికే చిత్రం నుండి విడుదలైన ఫస్ట్‌లుక్ పోస్టర్ నుండి ఇటీవలే విడుదలైన టీజర్ వరకు ప్రతీది సినిమాపై అంతకంతకు అంచనాలను పెంచుతూనే ఉన్నాయి. ఈ చిత్రాన్ని తమిళ దర్శకుడు మొహన్‌రాజా తెరకెక్కించాడు. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం అక్టోబర్ 5న విడుదల కానుంది. ఈ క్రమంలో మేకర్స్ వరుసగా అప్డేట్లను ప్రకటిస్తూ సినిమాపై క్యూరియాసిటీని పెంచుతున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన మరో బిగ్ అప్డేట్ను ప్రకటించారు.
ఎప్పుడెప్పుడా అని మెగా అభిమానులు ఎదురు చూస్తున్న గాడ్‌ఫాదర్ ట్రైలర్ అప్డేట్ వచ్చేసింది. గాడ్‌ఫాదర్ మూవీ ట్రైలర్‌ను బుధవారం రాత్రి 8 గంటలకు విడుదల చేయనున్నట్లు మేకర్స్ తాజాగా ప్రకటించారు. కాగా బుధవారం రోజు అనంతపూర్‌లో గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగనున్న విషయం తెలిసిందే. ఈ ఈవెంట్లోనే ట్రైలర్‌ను విడుదల చేయనున్నారు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను మేకర్స్ థమన్ మ్యూజిక్ కాన్సర్ట్‌తో గ్రాండ్‌గా జరుపనున్నారట.
గాడ్‌ఫాదర్ చిత్రం మలయాళంలో సూపర్ హిట్టయిన లూసీఫర్‌కు రీమేక్‌గా తెరకెక్కింది. కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలింస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈచిత్రంలో సల్మాన్‌ఖాన్ ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. సత్యదేవ్, నయనతార కీలకపాత్రలు పోషిస్తున్నారు. థమన్ సంగీత అందించిన ఈ చిత్రంలో ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాధ్ ఓ చిన్న పాత్రలో కనిపించనున్నాడు.
Read Also:
Dasara Movie | ‘దసరా’ మూవీ క్రేజీ అప్డేట్.. నాని అభిమానులకు పండగే..!
Chiranjeevi | చిరు154 మూవీకి భారీగా నాన్-థియేట్రికల్ బిజినెస్.. వామ్మో అన్ని కోట్లా?
Ponniyin Selvan-1 | ‘పొన్నియన్ సెల్వన్’ నటులకు షాకింగ్ రెమ్యునరేషన్.. ఒక్కొక్కరికి అన్ని కోట్లా?
BalaKrishna | కత్తితో ఫైటింగ్ చేస్తున్న బాలకృష్ణ.. NBK107 షూటింగ్ వీడియో వైరల్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
హయత్‌నగర్‌లో భూసేకరణపై ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

